ముఖ్యమంత్రి రేవంత్ తో భేటీ అయిన మంద కృష్ణ మాదిగ
న్యూస్ తెలుగు /ములుగు, హైదరాబాద్ :
ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేసి, అమలులోకి తీసుకురావాలని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి వర్యులు దామోదర్ రాజనర్సింహ,ను గురువారం యంఆర్పిఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ,మరియు మాదిగ ప్రజా ప్రతినిధుల బృందం కోరింది. సుమారు గంట సేపు రేవంత్ రెడ్డి తో ప్రతినిధి బృందం చర్చించింది.
ప్రస్తుతం విద్యా , ఉద్యోగాల భర్తీ జరుగుతున్న నేపథ్యంలో, త్వరగా ఎస్సీ వర్గీకరణ చేయాలని, చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ విప్ అడ్లూర్ లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు ఎమ్మెల్యేలు వేముల వీరేశం,కాలే యాదయ్య , డా. కవ్వంపల్లి సత్యనారాయణ , తోట సత్యనారాయణ ,మాజీ ఎంపీ పసునూరి దయాకర్ , ఓయు ప్రొఫెసర్లు సి.కాశీం , గడ్డం మల్లేశంఏ జియు , ప్రొఫెసర్ విద్యాసాగర్ ,ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ, కాంగ్రెస్ మాదిగ నేత కొండేటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : ముఖ్యమంత్రి రేవంత్ తో భేటీ అయిన మంద కృష్ణ మాదిగ)