Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌అదానీ కుంభకోణంపై విచారణ చేయాలి

అదానీ కుంభకోణంపై విచారణ చేయాలి

అదానీ కుంభకోణంపై విచారణ చేయాలి

గన్ పార్క్ నుంచి ఈ డీ ఆఫీస్ వరకు కాంగ్రెస్ నిరసన ర్యాలీ

న్యూస్ తెలుగు /ములుగు, హైదరాబాద్ : అదాని కుంభం కోణంపై విచారణ చేయాలని,రాష్ట్ర మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణరావు డిమాండ్ చేశారు గురువారం గన్ పార్క్ నుండి ఈ డి ఆఫీస్ వరకు ర్యాలీ చేశారు.ముందు వరసలో మంత్రులు నిలిచి ర్యాలీలో పాల్గొన్నారు.పలు నినాదాలతో సత్యమేవ జయతే పోస్టర్ చేతబట్టి ఈ డీ ఆఫీస్ వరక ర్యాలీ చేపట్టారు.
ఈడీ కార్యాలయం ముందు బైఠాయించి మంత్రులు సీతక్క, పొన్నం, జూపల్లి, ఎంపీలు, ఎమ్మెలేలు, ఎం ఎల్ సి లు పాల్గొన్నారు.
అదానీ కుంభకోణంపై జేపిసి వేయాలి, సెబీ చైర్మన్ తక్షణం రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేశారు.దేశం కోసం, సత్యం కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందని మంత్రి సీతక్కఅన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క మీడియాతో మాట్లాడుతూ నల్లదనం తెచ్చి ప్రజలకు పంచుతామని చెప్పిన, బిజెపి, దేశ సంపదను విదేశాలకు తరలించేలా సహకరిస్తుందన్నారు.
అదానీ కుంభకోణంపై దర్యాప్తు చేయాల్సిన సెబి పెద్దలే, పెట్టుబడులు పెట్టారన్న వాస్తవాలు బయటకు వస్తున్నాయని, ఇది కంచే చెను మేసినట్టుగా ఉందని,
అన్ని వ్యవస్థలను మోడీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని, బిజెపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, అదానీ అవకతవకలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.
అప్పుడే నిజాలు బయటకు వస్తాయాని,
జేపీసీ వేయడానికి కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తోందని, నీతిమంతులం అని చెప్పుకునే,బిజెపి కేంద్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందన్నారు.
బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రజలు పేదలవుతున్నారని, అదానీ ఆస్తులు వేయి రేట్లు పెరిగాయాని,అదానీ స్కాం పై టిఆర్ఎస్ ఎందుకు మౌనం గా వుందని విమర్శలు చేశారు.
బిజెపి మెప్పుకోసమే టిఆర్ఎస్ పాకులాడుతుoదని,
జైల్లో ఉన్న తమ ఆడబిడ్డను కాపాడుకోవడానికి, బిజెపి ముందు టిఆర్ఎస్ మోకరిళ్ళుతోందన్నారు.
అదానీ స్కాం పై జేపీసీ వేసేదాకా పోరాటం కొనసాగిస్తాం మంత్రి సీతక్క హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story : అదానీ కుంభకోణంపై విచారణ చేయాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!