UA-35385725-1 UA-35385725-1

మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డితో బయో సింథటిక్ ఉడ్ కంపెనీ ప్రతినిధులు భేటీ

మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డితో

బయో సింథటిక్ ఉడ్ కంపెనీ ప్రతినిధులు భేటీ

– రాష్ట్రంలో సింథటిక్ ఉడ్, హైడ్రో ఫోయిల్ బోట్లు తయారీ కంపెనీలు పెట్టేందుకు సుముఖత

– 300కోట్లతో రెండు కంపెనీలు పెట్టేందుకు ముందుకొచ్చిన ఆరియా గ్లోబల్ కంపెనీ

– ముఖ్యమంత్రితో చర్చించి అన్నివిధాలా సహకరిస్తామని మంత్రి వెల్లడి

న్యూస్‌తెలుగు/వెలగపూడి: రాష్ట్రంలో బయో సింథటిక్ ఉడ్ తయారీ యూనిట్ మరియు హైడ్రో ఫోయిల్ బోట్లు తయారు చేసే కంపెనీలు పెట్టేందుకు ‘‘ARIA GLOBAL’’ SINGAPORE and SPAIN కంపెనీ ముందుకు వచ్చింది. ఈ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంపత్ కుమార్ రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి గారిని సచివాలయంలోని తన కార్యాలయంలో గురువారం కలిశారు. సహజసిద్దమైన చెక్కకు ఏమాత్రం తీసిపోనివిధంగా ప్లాస్టిక్ వ్యర్థాల నుండి తయారు చేసే బయో సింథటిక్ ఉడ్ ను తాము చేయారు చేస్తున్నామని మంత్రికి వివరించారు. ఇది ప్రాక్టికల్ గా అనేక చోట్ల సక్సెస్ అయ్యిందని మంత్రికి తెలిపారు. ఈ బయో సింథటిక్ ఉడ్ వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని పేర్కొన్నారు. అడవులను సంరక్షించేందుకు మరియు వివిధ రంగాల్లో ఈ బయోసింథటిక్ వినియోగం వల్ల నిర్వహణ ఖర్చు కూడా తగ్గించేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని వివరించారు. అదేవిధంగా అధునాతన టెక్నాలజీతో హైడ్రో ఫోయిల్ బోట్లు తాము తయారు చేస్తున్నామని మంత్రికి తెలిపారు. ఈ బోట్లను ఇండియన్ నేవీకి త్వరలో సప్లయ్ చేయడానికి ఇప్పటికే చర్చలు సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యాయని, సప్లయ్ చేసే అంశంపై తుది నిర్ణయం నేవీ ఉన్నతాధికారుల వద్ద పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. ఈ బోట్లు తయారు చేసే కంపెనీని ఏపీలో నెలకొల్పి, ఇక్కడి నుండే బోట్లు తయారు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ బోట్లు సాధారణ బోట్ల కంటే వేగంగా, సురక్షితంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇవి కోస్టల్ పెట్రోలింగ్ కు చాలా ఉపయోగకరమని వివరించారు. అందుకే ఇండియన్ నేవీ వీటిని తీసుకోవాలని చూస్తోందని తెలిపారు. ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిస్తే రాష్ట్రంలో బయో సింథటిక్ ఉడ్ తయారీ మరియు బోట్ల తయారీ కంపెనీలను రూ.300కోట్ల పెట్టుబడితో పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి జనార్ధన్ రెడ్డికి సంపత్ కుమార్ పలు వివరాలు సమర్పించారు. దీనిపై మంత్రి జనార్ధన్ రెడ్డి స్పందిస్తూ…ఈ విషయాలను ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి దృష్టికి తీసుకెళతామని తెలిపారు. ఉన్నతాధికారులతో మాట్లాడి కంపెనీలు పెట్టేందుకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. మంత్రి స్పందన పట్ల సంపత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. (Story : మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డితో బయో సింథటిక్ ఉడ్ కంపెనీ ప్రతినిధులు భేటీ)

 

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1