వినుకొండలో పెరిగిన ట్రాఫిక్ సమస్య
న్యూస్‌తెలుగు/ వినుకొండ : వినుకొండలో తీవ్రంగా పెరిగిన ట్రాఫిక్ సమస్య వల్ల వినుకొండలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి పోలీసు వారు కృషి చేయాలని బుధవారం సిపిఐ పార్టీ వినుకొండ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్ సి.ఐ శోభన్ బాబు కి సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ “వినుకొండ పట్నంలో పెరిగిన ట్రాఫిక్ వల్ల ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బాటసారిలు నడిచి వెళ్లాలన్నా కూడా ట్రాఫిక్ సమస్య వల్ల పలు సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, రోడ్లుకు అడ్డంగా వాహనాలు నిలిపి తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారని, అదేమని ప్రజలు వాహనదారులను ప్రశ్నిస్తే ప్రజలపై వాహనదారులు తిరుగుబాటు చేస్తున్నారని, కనుక పోలీస్ వారు వినుకొండలో పెరిగిన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని బూదాల శ్రీనివాసరావు సి. ఐ ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పిన్నబోయిన వెంకటేశ్వర్లు, రాయబారం వందనం, కొప్పరపు మల్లికార్జున, ధూపాటి మార్కు, సోమవరపు కోటేసు, తదితరులు పాల్గొన్నారు. (Story : వినుకొండలో పెరిగిన ట్రాఫిక్ సమస్య)