దేశవ్యాప్తంగా భారత్ బంద్ విజయవంతం
న్యూస్‌తెలుగు/ వినుకొండ : మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు , రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ సూచనలతో వినుకొండ నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆగస్టు21న భారత్ బంద్ శాంతియుత నిరసన కార్యక్రమం పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో భారీ ర్యాలీతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, మాల నాయకులు పాల్గొన్నారు. పలు బస్సులను బస్టాండ్ లోకి వెళ్లకుండా అడ్డగించారు. కాలేజీ లు, స్కూల్ లను ముసివేయించారు. వ్యాపార సంస్థలను అడ్డుకున్నారు.. సుప్రీం కోర్టు తీర్పు ను పునః పరిశీలించాలని డిమాండ్ చేశారు. అలా చేయకుంటే ఉద్యమాలు భారీ ఎత్తున చేపడతామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వారి రాజకీయ లబ్ది కోసమే వర్గీకరణ తెరపైకి తెచ్చారని లేకుంటే గతంలో సుప్రీంకోర్టు తిరస్కరించిన బిల్లును మళ్లీ బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ కిషన్ రెడ్డి దళితుల మీద అతి ప్రేమ చూపించటం నాటకమని ఆయన అన్నారు. ఇప్పటి కపట నాటకాలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. అన్నదమ్ముల ల కలిసి ఉన్న మాల మాదిగలు విడదీసి వారి మధ్య చిచ్చు పెట్టి ఆ అగ్గితో చలిమంట కాసుకుంటూ తాత్కాలిక శునకానందం పొందుతూన్న రాజకీయ నాయకులకు రాజకీయ సమాధి కట్టడం ఖాయమని అన్నారు.ఒక వర్గాన్ని వేలెత్తి చూపిస్తూ వారిని ద్రోహులుగా చిత్రికరించి చూపించడం అన్యాయమని అన్నారు. వర్గీకరణ వద్దు రా కలిసుంటే ముద్దు రా అనే నినాదాలతో శాంతియుత ర్యాలీ తో ముందుకు సాగారు. భారత్ బంద్ కి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియచేసారు. (Story : దేశవ్యాప్తంగా భారత్ బంద్ విజయవంతం )