బంధాల అభయారణ్యంలో 4g సేవలు
ఎయిర్టెల్ నెట్వర్క్ టవర్ సేవలను ప్రారంభించిన
జిల్లా ఎస్పీ డా. శబరిష్
న్యూస్‌తెలుగు/ ములుగు : దశాబ్దాలు గడుస్తున్న ములుగు అభయారణ్యంలో నో,సిగ్నల్స్ ఇన్నేళ్లుగా అత్యవసర సేవలకు సైతం నోచుకోని ఆదివాసి ప్రజలు ఇన్నాళ్లకు ,పోలీస్ శాఖ వారి కృషితో పలు దఫాలుగా,ఎయిర్టెల్ యాజమాన్యం తో సంప్రదింపులు /చర్చల అనంతరం ఎయిర్టెల్ నెట్వర్క్ వారు 4g సేవలతో కూడిన సిగ్నల్ టవర్ ను జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో స్థాపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ములుగు జిల్లా ఎస్పీ డా.శబరిష్ ముఖ్యఅతిథిగా ఆహ్వానించగా, బుధవారం ద్విచక్ర వాహనాల ద్వారా బంధాల చేరుకొని ఎయిర్టెల్ నెట్వర్క్ టవర్ సేవలను ఎస్పీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ యొక్క ఎయిర్టెల్ నెట్వర్క్ టవర్ సేవలు బంధాల పోచాపూర్ అల్లిగూడెం గొల్లపల్లి నర్సాపూర్ వంటి మారుమూల గ్రామాల ప్రజలు లబ్ధి పొందుతారని, ఇంత కాలం నెట్వర్క్ లేక మారు మూల గ్రామాల, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అత్యవసర సేవలైన పోలీస్, వైద్యం, అగ్నిమాపక అధికారులను సంప్రదించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా వైద్య సేవల కోసం సమాచారం అందించలేక ఇబ్బందులకు గురవుతున్నారని, ఇకపై అలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వం, ద్వారా జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందని, ఇప్పటికే మేడారం నుండి తాడ్వాయి,తాడ్వాయి నుండి పస్రా, మధ్య నెట్వర్క్ ను బలోపేతం చేసే దిశగా నెట్వర్క్ టవర్ల నిర్మాణం కోసం ప్రాతిపదికను పంపించడం జరిగిందన్నారు.రానున్న కాలంలో నెట్వర్క్ సమస్య ఉన్న మరిన్ని ప్రాంతాలను గుర్తించి పరిష్కరిస్తామని తెలియజేస్తూ నెట్వర్క్ టవర్లు నిర్మించడంలో ప్రతి-నిత్యం శ్రమించిన డీఎస్పీ ములుగు రవీందర్, సి ఐ పస్రా రవీందర్ ఎస్సై తాడ్వాయి శ్రీకాంత్ రెడ్డి లను ఎస్ పి అభినందించారు.
ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి ములుగు రవీందర్, ఆపరేషన్ మేనేజర్ సుగుణాకర్ రెడ్డి ప్రాజెక్టు మేనేజర్ సదానందం సిఐ పస్రా గద్దె రవీందర్ ఎస్ ఐ తాడ్వాయి శ్రీకాంత్ రెడ్డి మేనేజర్ రమేష్ బాబు ప్రదీప్ మోతే గ పాల్గొన్నారు. (Story :బంధాల అభయారణ్యంలో 4g సేవలు)