అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయ్!
న్యూస్‌తెలుగు/అమరావతిః ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలు పెరగనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన ప్రక్రియ 2026లో జరిగే అవకాశం ఉంది. 2026లోనే శాసనసభ స్థానాల పెంపుదల ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల లలో శాసనసభ స్థానాల పెంపు 2026లోనేనని తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యుడొకరు అడిగిన ప్రశ్నకు కేంద్రప్రభుత్వం స్పష్టంచేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం 2026లో జనాభా లెక్కల అనంతరమే ఏపీలో 175 నుంచి 225 శాసనసభ స్థానాలు, తెలంగాణలో 119 నుంచి 153 శాసనసభ స్థానాల పెంపుదల ఉంటుంది. అలాగే, నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడే ఎస్సీ ఎస్టీ స్థానాల పునఃసర్దుబాటు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభ జన చట్టం -2014ను న్యాయమంత్రిత్వ శాఖ ద్వారా మార్చి1, 2014న గెజిట్ లో ప్రచురించినట్లు వివరించింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్న విషయం తెల్సిందే. కాకపోతే పదేళ్లు గడిచినా కేంద్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. (Story : అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయ్!)