స్ట్రింగ్ మెటావర్స్ ఆసక్తికర ఫలితాలు
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: వెబ్ 3.0 సేవల సంస్థ స్ట్రింగ్ మెటావర్స్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. రూ.50.02 కోట్ల ఆదాయంపై రూ.5.38 కోట్ల నికరలాభాన్ని సంస్థ ఆర్జించింది. ఎన్‌సీఎల్‌టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) ఆదేశాల మేరకు ఇటీవల ఈ సంస్థ బీఎస్‌ఈలో నమోదైన బయో గ్రీన్ పేపర్స్ లిమిటెడ్ అనే కంపెనీలో విలీనం అయింది. స్పేస్‌నెట్ ఎంటర్‌ప్రైజెస్, 63 మూన్స్ టెక్నాలజీస్, 3.0 వెర్స్ లిమిటెడ్ అనే సంస్థల మద్దతున్న స్ట్రింగ్ మెటావర్స్‌కు గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ, హైదరాబాద్, యూఏఈ, హాంకాంగ్‌లో కార్యాలయాలు ఉన్నాయి. వెబ్ 3.0 నెక్స్ట్`జనరేషన్ టెక్నాలజీలు ఎంతో వేగంగా విస్తరిస్తున్నందున తాము మూడేళ్లపాటు నూరుశాతం వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని స్ట్రింగ్ మెటావర్స్ వ్యవస్థాపకుడు కృష్ణమోహన్ మీనవల్లి పేర్కొన్నారు. వెబ్ 3.0 టెక్నాలజీస్‌లో డిజిటల్ ఆస్తుల సృష్టిలో సంస్థల కంటే వ్యక్తులు క్రియాశీల పాత్ర పోషిస్తారని ఆయన వివరించారు. (Story : స్ట్రింగ్ మెటావర్స్ ఆసక్తికర ఫలితాలు)