జిల్లాలో రైతుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా
న్యూస్‌తెలుగు/వనపర్తి : జిల్లాలో పొడు పట్టాలు ఇచ్చిన రైతుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు.
శనివారం రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనసూయ సీతక్క తో కలిసి జిల్లా కలక్టర్లు, అటవీ శాఖ అధికారులు శాసన సభ్యులతో పోడు భూమి సమస్యల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
పోడు పట్టాలు ఇచ్చిన రైతుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని, ఇచ్చిన పట్టా భూములకు హద్దులు చూపించాలని కలక్టర్లను సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి జిల్లాలో 419 దరఖాస్తులు ఆమోదించి 474 ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. పోడు పట్టాలు పొందిన రైతుల సమస్యలు ఏమైనా ఉంటే అటవీ శాఖ, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, జిల్లా షెడ్యూల్డు తెగల అభివృద్ధి అధికారి నుషిత తదితరులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. (Story : జిల్లాలో రైతుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా)