సంగమం వద్ద నవ హారతులకు సిద్ధం చేస్తున్నాం`కలెక్టర్ సృజన
న్యూస్‌తెలుగు/విజయవాడ : పవిత్ర సంగమం వద్ద నవహారతులు ఇచ్చేందుకు ఏర్పాట్లు సిద్దం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ.సృజన అధికారులను ఆదేశించారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణా, గోదావరిలకు హారతులిచ్చేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లను శనివారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పవిత్ర సంగమం వద్ద నవ హారతులిచ్చే కార్యక్రమాన్ని పునరుద్దరించేందుకు, పవిత్ర సంగమం ప్రాంతం అభివృద్ధికి వివిధ శాఖల సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు, సీఆర్డీఏ, ఇరిగేషన్, ట్రాన్స్‌కో, ఆర్ అండ్ బీ, పోలీస్ తదితర శాఖల అధికారుల సమన్వయంతో అభివృద్ధి పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఇబ్రహింపట్నం నుండి పవిత్ర సంగమం వరకు 1.7 కిలో మీటర్ల ప్రధాన రహదారిని అభివృద్ధికి, భవిష్యత్‌లో రోడ్డు దెబ్బతినకుండా కాలవగట్లను పటిష్ట్ట పర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. యాత్రికుల భద్రత, పారిశుధ్యం వంటి అంశాలపై ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి మునిసిపల్ కమీషనర్ రమ్యకీర్తన, సీఆర్‌డీఏ సీఈ శివప్రసాద్‌రాజు, ఏపీ టూరిజం జీఎం నాగేశ్వరరావు, ఆ అండ్ బీ ఎస్‌ఈ విజయశ్రీ, మత్స్యశాఖ జిల్లా అధికారి పెద్దిబాబు, దేవస్థానం ఎస్‌ఈ ఎల్.రమ, ఇబ్రహీంపట్నం తహాశీల్థార్ వై.వెంకటేశ్వర్లు, ఎంపీడీవో రామకృష్ణ నాయక్, ఇరిగేషన్ ఈఈ కృష్ణారావు, ఏపీసీపీడీసీఎల్ ఈఈ శ్రీనివాసరావు, మత్స్య శాఖ ఎఫ్‌డీఓ అలేఖ్య పాల్గొన్నారు. (Story : సంగమం వద్ద నవ హారతులకు సిద్ధం చేస్తున్నాం`కలెక్టర్ సృజన )