Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా పవిత్ర సంగమం`కలెక్టర్‌ డా.సృజన

ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా పవిత్ర సంగమం`కలెక్టర్‌ డా.సృజన

ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా పవిత్ర సంగమం`కలెక్టర్‌ డా.సృజన

న్యూస్‌తెలుగు/విజయవాడ : దసరా ఉత్సవాలకు ముందుగానే పవిత్ర సంగమం వద్ద నవ హారతులకు ఏర్పాట్లు పూర్తిచేసి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ డా.జీ.సృజన అధికారులకు ఆదేశించారు. ఇబ్రహీంపట్నం సమీపంలో కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం వద్ద నవ హారతులకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్‌ శనివారం స్థానిక కలెక్టర్‌ కార్యాలయంలో దేవాదాయ, ఆర్‌ అండ్‌ బీ, రెవెన్యూ, ఇరిగేషన్‌, పర్యాటక, పోలీస్‌, సీఆర్‌డీఏ, ఏడీసీ, ట్రాన్స్‌కో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా పవిత్ర సంగమ ప్రదేశాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నవ హారతులను పునరుద్దరించి పవిత్ర సంగమానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను సోమవారానికి అందజేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న వాటికి రిపేర్లు నిర్వహించేందుకు, అవసరమైన వాటికి ప్రతిపాదనలను తయారు చేయాలన్నారు. జాతీయ రహదారి నుండి పవిత్ర సంగమానికి చేరుకునే రెండు వైపుల రహదారికి తాత్కాలిక మరమ్మతులుతో పాటు శాశ్వత రహదారి నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు, రహదారి కృంగిపోకుండా పటిష్టంగా ఉండేందుకు కాలవగట్లకు బండ్‌ నిర్మించేందుకు, పాడైన ఘాట్‌లో మరమ్మతులు చేపట్టేందుకు, పవిత్ర సంగమ ప్రాంతంలో విద్యుత్‌కు ప్రస్తుత హైమాక్స్‌ లైట్లకు రిపేర్లు, కొత్తవి ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతంలో ప్రస్తుతమున్న ముళ్ళ కంపలు, పొదలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పర్యాటకులకు వీలుగా వాష్‌రూమ్స్‌, డ్రస్‌ ఛేంజ్‌ రూమ్స్‌, త్రాగునీటి ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కొండపల్లి మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. పర్యాటకులు, భక్తుల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు వీలుగా అవసరమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం తాత్కాలిక వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేసి శాశ్వత వైద్యకేంద్రానికి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ డా.నిధిమీనా, డీఆర్‌వో శ్రీనివాసరావు, ఆలయ ఇవో రామరావు, ఈఈ ఎల్‌.రమ, ఆర్‌ అండ్‌ బి ఎస్‌ఈ విజయశ్రీ, ఇరిగేషన్‌ ఈఈ కృష్ణారావు, కొండపల్లి మునిసిపల్‌ కమీషనర్‌ రమ్యకీర్తన, సీఆర్‌డీఏ సీఈ శివప్రసాద్‌రాజు, ఎంపీడీవో రామకృష్ణనాయక్‌, ఏపీసీపీడీసీఎల్‌ ఈఈ శ్రీనివాసరావు, ఏడీసీసీ జేడీ ధర్మజ, ఇబ్రహింపట్నం తహాశీల్థార్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. (Story : ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా పవిత్ర సంగమం`కలెక్టర్‌ డా.సృజన )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!