ప్రతి లబ్ధిదారుడికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు చేరాలీ
రూ.1,078,3500 నిధులకు సంబంధించి 525 చెక్కులను లబ్ధిదారులకు అందజేత
ఇంటి వద్దకు వెళ్లి లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/వనపర్తి : ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఇబ్బందులు ఎదుర్కొని ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ రాజ్యంలో ఆర్థిక సహాయం అందుతుందని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి అందించే ఈ సహాయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులకు ఇంటి వద్దకు వెళ్లి చెక్కులను అందించాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘ రెడ్డి సూచించారు
ఆదివారం వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలోని ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పథకాలన్న కళ్యాణ లక్ష్మి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకోవాలన్న కమిషన్లు మాట్లాడుకునేవారని నేడు ఇందిరమ్మ రాజ్యంలో లబ్ధిదారులకు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ప్రభుత్వమే ఇంటి వద్దకు చెక్కులను తీసుకువచ్చే అందజేస్తుందని ప్రజలు ఎవరు కూడా దళారుల మాటలు నమ్మే మోసపోకూడదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో వనపర్తి మండల మాజీ ఎంపీపి కిచ్చారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు. (Story : ప్రతి లబ్ధిదారుడికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు చేరాలీ)