వనపర్తి రోడ్డు పనులను పరిశీలించిన – ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి – పెబ్బేరు రోడ్డు నిర్మాణం, పనులను పెబ్బేరు శివారులో నేడు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పెబ్బేరు పర్యటనలో భాగంగా, పనులను పరిలించారు, అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో పెబ్బేరు పట్టణంలో కుడా రోడ్డు పనులను పూర్తి చేసి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. ఎమ్మెల్యే వెంట వనపర్తి బ్లాక్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా యువజన నాయకులు గంధం రంజిత్ కుమార్, మాజీ సర్పంచ్ లు వెంకటేష్ సాగర్, సురేందర్ గౌడ్, మాజీ డైరెక్టర్ రాములు, టౌన్ ఉపధ్యక్షులు రజక నరసింహ తదితరులు పాల్గొన్నారు.