కేటీఆర్ ని కలిసిన సోషల్ మీడియా అధ్యక్షులు మాధవరావు సునీల్ వాల్మీకి
న్యూస్‌తెలుగు/వనపర్తి : హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు ని ఆదివారం వనపర్తి బిఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షులు మాధవరావు సునీల్ వాల్మీకి కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రజల పక్షాన ఉండి వారి సమస్యలు అవగాహన చేసుకొని క్షేత్ర స్థాయిలో పోరాటం చేసి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మార్గదర్శనంలో బిఆర్ఎస్ పార్టీ నీ సోషల్ మీడియా పరంగా గ్రామ స్థాయి నుండి దేశ స్థాయి వరకు శ్రేణులు అందరూ క్రియాశీలకంగా వ్యవహరించాలని, బిఆర్ఎస్ పార్టీ మీద జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. (Story : కేటీఆర్ ని కలిసిన సోషల్ మీడియా అధ్యక్షులు మాధవరావు సునీల్ వాల్మీకి)