సీతారామ 2,3 ట్రయల్ రన్ సక్సెస్
– ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా భూముల్లో పసిడి పంటలు
– ప్రాజెక్టు పేరుతో గత పాలకుల ఆర్థిక దోపిడి
– ఇందిరమ్మ రాజ్యములో అందరూ సమానులే
– ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్న సీఎం రేవంత్
న్యూస్ తెలుగు/ భద్రాద్రి కొత్తగూడెం :
సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్2,3 ట్రయల్ రన్ విజయవంతమైంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి.
వ్యవసాయ, సహకార మరియు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, హౌసింగ్, సమాచారం, పౌరసరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ తో కలిసి ట్రైన్ రన్ నిర్వహించారు. అనంతరం పత్రిక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడుతూ
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు ఇది చారిత్రాత్మక రోజు అని ఎన్నో దశాబ్దాల నుండి గోదావరి జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా లోని కొన్ని లక్షల ఎకరాల లో పారటానికి ఇది ముందు అడుగు గా భావిస్తున్నానని అన్నారు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కువ కట్టుకు తక్కువ ఖర్చుతో నీరు అందించాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మా ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రతి ఏడాది 6 నుండి 6:30 లక్షల కొత్త ఏర్పాటు చేయడమని అన్నారు. ఈ ఐదు సంవత్సరాలు కాలంలో పై నుండి 35 లక్షల కొత్త ఆయకట్టుకు నీరు అందించడమే మా ప్రభుత్వంముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మల్లు బట్టి విక్రమార్క మరియు క్యాబినెట్ మంత్రుల ముఖ్య లక్ష్యం అని తెలిపారు. దీనిలో భాగంగానే ఈరోజు సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ట్రైలర్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఆగస్టు 15 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదగా రెండు మరియు మూడు పంప్ హౌస్ ల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని,అదే రోజు వైరాలో నిర్వహించే బహిరంగ సభలో రైతు రుణమాఫీ కి సంబంధించి రెండు లక్షల రూపాయలు రైతు రుణాలు రైతులకు చెక్కులు అందించే ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సీతారామ ప్రాజెక్టుకు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నీటి కేటాయింపులు జరగలేదని, అనేక ఆటంకాలు ఉన్నప్పటికీ మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరిపి గోదావరి జలాల నుండి 67 టీఎంసీల నీరును సీతారామ ప్రాజెక్టుకు కేటాయించే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు.ఇది చివరి దశలో ఉన్నదని 10 నుండి 15 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుండి మంత్రి తెలిపారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ* ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఎట్టి పరిస్థితుల్లో గోదావరి జలాలను ఉపయోగించాలని ఉద్దేశంతో 2017 న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన నిర్వహించామని తెలిపారు. మొదటి ఐదు సంవత్సరాలు పని పనులు బాగానే నడిచిన తరువాతే ఐదు సంవత్సరాలు నత్త నడకన సాగాయని తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా కొత్తూరు, ఆర్కే రంగాపురం మరియు పూసుకుడం మూడు పంప్ హౌస్ ల ద్వారా గోదావరి జలాలను 104 కిలోమీటర్ల వరకు తీసుకువెళ్ల గలిగాం అని తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 9.8 కిలోమీటర్ల దగ్గర మారెళ్ళ పాడు ఎత్తిపోతల పథకం ద్వారా తుమ్మల చెరువుకి పనులు జరుగుతున్నాయని,దానికి కొంత భూసేకరణ మరియు కెనాల్ పనులు పూర్తి చేస్తే అక్కడ సుమారు 15,795 ఎకరాలకు అశ్వాపురం మండలంలో సాగులోకి వస్తుందని తెలిపారు. 74వ కిలోమీటర్ వద్ద 38 వేల ఎకరాల కు సాగునీరు దించే అవకాశం ఉందని, దీనికి కూడా భూసేకరణ పూర్తి చేస్తే ఈ సంవత్సరం వచ్చే సీజన్ కల్లా పూర్తి చేస్తే సాగులోకి వస్తుందని తెలిపారు. 74 కిలోమీటర్ల నుంచి 98వ కిలోమీటర్ వరకు రెండవ ప్యాకేజీ లో 34 వేల ఎకరాలు సాగులోకి వస్తుందని 380 కోట్లు ఖర్చు పెట్టాలని, దీనికిగాను త్వరగా భూసేకరణ మరియు టెండర్లు పూర్తి చేయడం ద్వారా పైభాగానికి సాగునీరు ఇచ్చే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని కోరారు. 102 కిలోమీటర్ల వద్ద రాజీవ్ లింకు కెనాల్ ముఖ్యమంత్రి మరియు ఇరిగేషన్ మంత్రి తర్వాత మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అది కేవలం సాగర్ కు నీరు ఇబ్బంది వచ్చినప్పుడు గోదావరి జలాలను వాడుకోవడానికి ఉపయోగపడుతుందని, ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో లక్ష ఇరవై వేల ఎకరాల పైన మీడియం ప్రాజెక్ట్ లైన వైరా లంకసాగర్ నాగార్జునసాగర్ ఆయకట్టులకు నీరు ఇవ్వచ్చు అని మంత్రి తెలిపారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ* ఈరోజు రెండు మరియు మూడు లిఫ్ట్ పంపుల ట్రైలర్ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని అన్నారు. జలయజ్ఞంలో భాగంగా నాడు దివంగత నేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. దాన్ని గత ప్రభుత్వం రిలీజ్ అయిన పేరుతో సుమారు తొమ్మిది రెట్ల అధిక విషయంతో 18 వేలకోట్ల వ్యయంతో మొదలుపెట్టి దానికి తల తోక రెండు తెలియకుండా, అక్కడ ఒక గుంట ఇక్కడ ఒక గుంట తొవ్వుకుంటూ పోతే ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత వాటి అన్నింటినీ సరిచేసి దీనిలో మొదటి ప్రాధాన్యత దేనికి ఇస్తే బాగుంటుంది, అనిసుమారు 8000 కోట్ల పైన గత ప్రభుత్వం నిరుపేయోగంగా ఖర్చుపెట్టిన ప్రజల డబ్బును ప్రజలకు ఉపయోగపడే విధంగా సరిచేసి రాబోయే కొద్ది రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబోతున్నామని తెలిపారు. పినపాక,అశ్వరావుపేట,సత్తుపల్లి, మధిర, వైరా,పాలేరు మరియు ఖమ్మం నియోజకవర్గంలోని ఒక మండలం ఈ ప్రాంతాలన్నింటికీ ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలోకేవలం భద్రాచలం మరియు ఇల్లందు నియోజకవర్గాలకు సాగునీరు అందేలా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ మరియు భూసేకరణ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే సీజన్ కల్లా సాగునీరు అందించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని కోరారు.
ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ కొత్వల శ్రీనివాస్, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, రాహుల్ బొజ్జ ఐఏఎస్ నీ టిపారుదుల శాఖ సెక్రెటరీ, ప్రశాంత్ జీవన్ పాటిల్ స్పెషల్ సెక్రటరీ నీటిపారుదల శాఖ,ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్,చీఫ్ ఇంజనీర్ విజయభాస్కర్, ఎస్సీ కొత్తగూడెం ఎస్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ భద్రాచలం వెంకటేశ్వర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ కుమార్ మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story : సీతారామ 2,3 ట్రయల్ రన్ సక్సెస్ )