చాట్రాయి యుటిఎఫ్ స్వర్ణోత్సవాలు
న్యూస్ తెలుగు /చాట్రాయి : ఉపాధ్యాయ ఉధ్యమ చరిత్రలో యూటిఎఫ్ పోరాటాలు మరువలేనివని యూటిఎఫ్ జిల్లా కొర్యదర్శి పంతగాని వీరకోటి గుర్తు చేసారు.శనివారం మండల విద్యా వనరుల కార్యలయం పతాక అవిష్కరణ చేసారు.ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యుటిఎఫ్ నేటికీ 50 వసంతాలు పూర్తిచేసుకుని స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పతాకావిష్కరణలు జరపమని సంఘం ఇచ్చిన పిలుపుమేరకు ఎం ఆర్ సి నందు ఏలూరు జిల్లా యుటిఎఫ్ కార్యదర్శి పంతగాని వీర కోటి పతాకావిష్కరణ కావించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 1974 ఆగస్టు 10 న ఏర్పడింది. నాటి నుంచి నేటి వరకు ఎంతోమంది సంఘ నేతలు ఉపాధ్యాయ సమస్యల కోసం పోరాడి తమ జీవితాలను సైతం త్యాగం చేశారు. వారి ఫలితంగా అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకున్నాయని . యుటిఎఫ్ నిర్మాతలైన చెన్నుపాటి, రామిరెడ్డి, సీతారామాచారి, పోలిశెట్టి తదితరుల ఆశయాలుకు అనుగుణంగా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి చీదిరాల రఘు, ట్రెజరర్ జి ఎస్ ఎన్ రెడ్డి, జిల్లా కౌన్సిలర్ పేరు రత్తయ్య తదితరులు పాల్గొన్నారు.