మంథన్ స్కూల్లో గ్లోబల్ యూనివర్శిటీ ఫెస్టివల్
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: విద్యార్థుల భవిష్యత్తు ఆకాంక్షలకు మార్గనిర్దేశం చేయడమే లక్ష్యంగా మంథన్ స్కూల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని స్కూల్ ఆవరణలో గ్లోబల్ యూనివర్శిటీ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ఫెస్టివల్‌కు ప్రపంచంలో ఉన్న వందకు పైగా యూనివర్సిటీలు హాజరయ్యాయి. భారతదేశం, యూఎస్, యూకే, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నుంచి విశ్వవిద్యాలయాలు పాల్గొన్నాయి. ఈ ఫెస్టివల్ ఉన్నత పాఠశాల తల్లిదండ్రులు, విద్యార్థులను విశేషంగా ఆకర్షించింది. తల్లిదండ్రులు టేబుల్ ఫెయిర్‌లో విశ్వవిద్యాలయ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ ఫెస్టివల్ నా ఉన్నత విద్య కోసం ఏ స్ట్రీమ్‌ను ఎంచుకోవాలి?, ఏ కళాశాలలు సరిపోతాయన్న విషయంలో చాలా స్పష్టమైన విజన్ ఏర్పడిరదని మంథన్ విద్యార్థి తెలిపారు. (Story : మంథన్ స్కూల్లో గ్లోబల్ యూనివర్శిటీ ఫెస్టివల్)