Home ఆంధ్రప్రదేశ్‌ లోక‌ల్ న్యూస్‌ (AP) మహిళల ఆర్ధికాభివృద్దే ప్రభుత్వ లక్ష్యం

మహిళల ఆర్ధికాభివృద్దే ప్రభుత్వ లక్ష్యం

0

మహిళల ఆర్ధికాభివృద్దే ప్రభుత్వ లక్ష్యం

-మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

-పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి

న్యూస్ తెలుగు /భద్రాద్రి కొత్తగూడెం : మహిళను ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రభుత్వలక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావు, కలెక్టర్ బితేష్ వి పాటిల్, ఎస్పి రోహిత్ రాణితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. = ముందుగా లక్ష్మీ దేవిపల్లి మండలం అశోక్నగర్ కాలనీలో సుమారు రూ.1.50 కోట్ల అంచనాలతో నిర్మించనున్న సైడ్ కాలువకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. అనంతరం అటవీశాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీగా లక్ష్మీ దేవిపల్లి మండల పరిధిలోని చాతకొండ బీట్లో స్వచ్ఛతనం- పచ్చదనం ముగింపులో భాగంగా వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలునాటారు. వన మహోత్సవ లక్ష్యాన్ని అంతా చేరుకోవాలని సూచించారు. కొత్తగా ఎన్వరూ పోడు వ్యవసాయం చేయరాదని, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవన్నారు. పోడుచేసే రైతులకు అటవీశాఖ జమాయిల్ పెంపకంతో పాటు పలు పండ్లతోటల పెంపకంపై అవగాహన కల్పించాలని, పోడు వ్యవసాయం చేసే వారితో అటవీ అధికారులు స్నేహభావంతో మెలగాలని అన్నారు. గత ఏడాది గిరిజనులవాడిలో మృతి చెందిన రేంజర్ శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు 500 గజాల ఇంటి స్థలం పట్టాను మంత్రి త్వరలో అందజేస్తామని హామీ ఇచ్చారు. పాల్వంచ మండలంలోని సుమారు 50 లక్షల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సింథటిక్ టెన్నీస్ కోర్టు ప్రారంభించారు. దీనిని నిత్యం సుమారు 80 మంది వరకు శిక్షణ పొందేలా రూపొందించాలని మంత్రి అన్నారు. అనంతరం క్రీడాకారులతో కలిసి టెన్నీసి ఆడారు. ఖేల్ ఇండియాలో భాగంగా ఆర్చరీ శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో ఉపయోగ పడకాయని క్రీడీలను ప్రోత్సహించేందుకు, క్రీడాకారులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అనంతరం క్రీడాప్రాంగణంలో మొక్కలు నాటారు. జిల్లా ఐడిఓసి కార్యాలయ ఆవరణలో పట్టణ పేదరిక నిర్మూల సంస్థ (మెప్మా) గ్రూప్ కార్యక్రమాల్లో భాగంగా ఓం సాయిరాం, వినాయక పేద ప్రాంత సమాఖ్య, భరతమాత పట్టణ
సమాఖ్య ఆధ్వర్యంలో రూ.6 లక్షల బ్యాంకు రుణంతో ఏర్పాటు చేసిన ఇందిర మహిళా శక్తి క్యాంటిన్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసేందుకు రుణ సదుపాయాన్ని అందించి వివిధ ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. రాబోయే ఆడేళ్లలో చిరువ్యాపారులను ప్రోత్సహించేందుకు పలు విధాల నైపుణ్య విభాగాల్లో శిక్షణ ఇచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యావ్యవస్థ బలోపేతానికి అన్ని రకాలు కార్యచరణలను సిద్ధం చేశామని, ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో మొత్తం ఐదు ఇందిరా మహిళశక్తి క్యాంటెన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందులో భాగంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఆవరణలో మొదటిగా ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడి వంటలు అమ్మచేతి వంటల్లా ఉంటాయని, నాణ్యతో పాటు రుచి,శుచికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి కృష్ణగౌడ్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డిఆర్డిఓ విద్యాచందన, ఆర్అండ్ బి ఇఇ వెంకటేశ్వరరావు, కొత్తగూడెం, పాల్వంచ మున్సిపల్ కమీషనర్లతో పాటు జిల్లా క్రీడాశాఖాధికారి పరంధామరెడ్డి, అటవి, మెప్మా అధికారులు పాల్గొన్నారు. (Story : మహిళల ఆర్ధికాభివృద్దే ప్రభుత్వ లక్ష్యం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version