చేనేత పరిశ్రమను ప్రభుత్వమే బతికించాలి
దేవన వీర నాగేశ్వరరావు, అధ్యక్షులు, రాష్ట్ర చేనేత జన సమాఖ్య
న్యూస్‌తెలుగు/ చీరాల : రాష్ట్ర ప్రభుత్వం చేనేత ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసి, చేనేత కార్మికులకు వేతనాలు కల్పించి ఉపాధి కల్పించాలి. చేనేత ముసుగులో పవర్ లూమ్ ఉత్పత్తులను విక్రయిస్తున్న వ్యాపారస్తులపై క్రిమినల్ కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలి. చేనేత కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికులకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. (Story : చేనేత పరిశ్రమను ప్రభుత్వమే బతికించాలి)