ప్రభుత్వాలు మారిన – ప్రయాణికులు తిప్పలు తీరావా
న్యూస్‌తెలుగు/ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా :సిర్పూర్ నియోజకవర్గంలో బస్టాండ్ లో ప్రయాణికులకు వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణ ప్రాంగణాలలో అరకోర వసతుల తో ప్రయాణికులు. ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిర్పూర్ లో బస్టాండ్ నిర్మిస్తామని కొబ్బరికాయ కొట్టారు తప్ప బస్టాండ్ నిర్మించడం మర్చిపోయారు. కౌటాల బస్టాండ్ ఉన్నప్పటికీ మూత్రశాల, మరుగుదొడ్లు సైతం నిరుపయోగంగా ఉండడంతో ప్రయాణికులు మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు,బైక్ స్టాండ్ లేకపోవడం బస్టాండ్ లో బైకులు పెట్టడంతో బస్సుడ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు.బెజ్జూర్ స్థలం ఉన్నప్పటికీ బస్టాండు నిర్మించడం మర్చిపోయారు చింతల మానేపల్లి బస్టాండు లేకపోవడంతో దుకాణాల ముందు చెట్ల కింద రోడ్లపై బస్సుల కోసం ప్రయాణికులు వేచి చూడాల్సిన పరిస్థితి గా మారింది. దహేగాం లో మార్కెట్లో బస్టాండ్ ఉన్నదా బస్టాండ్ లో మార్కెట్ ఉందా ప్రజలు గుర్తుపట్టలేకపోతున్నారు. కాగజ్ నగర్ బస్టాండ్ లో సీసీ కెమెరాలు లేకపోవడంతో పలుమార్లు దొంగతనం జరిగినప్పటికీ దొంగల ఆచూకీ ఇంతవరకు దొరకలేదు.
నాయకులు ఎన్నికల సమయంలోనే వాగ్దానాలు చెప్పి ఓట్లు దండుకొని గెలిచాక మర్చిపోతున్నారని ప్రజలు వాపోతున్నారు. (Story : ప్రభుత్వాలు మారిన – ప్రయాణికులు తిప్పలు తీరావా)