రైతులకు తప్పని తిప్పలు
తలుపులు తెరుచుకొని కార్యాలయం..
న్యూస్‌తెలుగు/ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : బెజ్జూర్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో పనిచేసే అధికారులు కార్యాలయానికి రాకపోవడంతో రైతులు పడిగాపులు కాసి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితిగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో రైతులు రుణాలు తీసుకొని తిరిగి డబ్బులు చెల్లించినప్పటికీ మళ్లీ బ్యాంకులో అప్పుగానే కనిపిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులకురుణమాఫీ సైతం రాకపోవడంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో వివరాలు అడిగితే బ్యాంకులో అడగమంటున్నారు. బ్యాంకుకు వెళ్లి అడిగితే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అడగమంటున్నారు. ఇలా రైతులను అటు నుండి ఇటు ఇటు నుండి అటు తిప్పుకుంటున్నారని రుణమాఫీ సంబంధించిన వివరాలు కూడా అధికారులు తెలపడం లేదని రైతులు సకారం, లాలయ్య వివిధ గ్రామాల చెందిన రైతులతో కలిసి పత్రిక ప్రకటనలు తెలిపారు. ఇకనైనా అధికారులు వెంటనే స్పందించి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. (Story : రైతులకు తప్పని తిప్పలు)