ప్రేక్షకుల హృదయాలు గెలిచిన సాయి కేతన్
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: బిగ్ బాస్ ఓటీటీ 3 గ్రాండ్ ఫినాలేలో బాలీవుడ్ స్టార్ సాయి కేతన్ రావు నాలుగో స్థానంలో నిలిచారు. కానీ ప్రేక్షకుల హృదయాలను గెలిచారు. 45 రోజులు సాగిన ఈ బిగ్ బాస్ షో ఎంతో రసవత్తరంగా సాగింది. ప్రముఖ నటుడు అనిల్ కపూర్ హోస్ట్ చేశారు. తెలుగు కుర్రాడు సాయి కేతన్ రావు తన వ్యక్తిత్వంతో జాతీయ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సాయి కేతన్ రావు తన ప్రయాణాన్ని ఆఖరి వరకు ‘నెవర్ సే డై’ వైఖరితో కొనసాగించారు. ఆయన ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండేవారు. తోటి పోటీదారుల పట్ల గౌరవంతో మెలిగేవారు. హౌస్‌లో అందరితో ఎంతో స్నేహంగా ఉండేవారు. విభేదాలు వచ్చినప్పుడు కూడా ఎంతో పరిపక్వతతో వ్యవహరించేవారు. ఇదే ఆయన సామర్థ్యాన్ని నిరూపించింది. ఇదే ప్రేక్షకులు, పోటీదారుల నుంచి ప్రశంసలను సంపాదించింది.(Story : ప్రేక్షకుల హృదయాలు గెలిచిన సాయి కేతన్)