Home వార్తలు నాణ్యమైన విద్యతోనే ఉత్పాదకత

నాణ్యమైన విద్యతోనే ఉత్పాదకత

0

నాణ్యమైన విద్యతోనే ఉత్పాదకత

న్యూస్‌తెలుగు/హైదరాబాద్‌: నాణ్యమైన విద్యతోనే ఉత్పాదకత పెరుగుతుందని ముఖ్య అతిథిగా విచ్చేసిన యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.జగదీష్‌ కుమార్‌ తెలిపారు. ఇది ఆర్థిక వ్యవస్థ బలాన్ని పెంచుతుందన్నారు. ఫిక్కీ, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయలో ఏర్పాటు చేసిన ‘ఎంపవర్రింగ్‌ ఎడ్యుకేషన్‌ ఎకోసిస్టమ్‌’ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నత విద్యా రంగాన్ని పరిశీలిస్తే, మన వద్ద ఉన్న 4.3 కోట్ల మంది విద్యార్థులలో, దాదాపు 94 శాతం మంది విద్యార్థులు 482 ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు, 487 ప్రభుత్వ నిధులతో నడిచే విశ్వవిద్యాలయాలు 130 మంది డీమ్డ్‌ టు ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలలో ఉన్నారన్నారు. సహజంగానే మనం స్థిరమైన, సురక్షితమైన, శాంతియుతమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తును కలిగి ఉండాలని కోరుకుంటామన్నారు. (Story : నాణ్యమైన విద్యతోనే ఉత్పాదకత)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version