ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమం ద్వారా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : గ్రామాల్లో ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమం ద్వారా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు.
శుక్రవారం డ్రై డే కార్యక్రమం సందర్భంగా పెద్దమందడి మండలంలోని జగత్ పల్లి, మనిగిల్ల, గట్లఖానా పూర్ గ్రామాల్లో పర్యటించి డ్రై డే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యల పై ప్రజలకు గ్రామ సిబ్బందికి అవగాహన కల్పించారు.
అనంతరం గట్లఖానాపూర్ ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. (Story : ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమం ద్వారా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి)