పారిస్ ఒలింపిక్స్‌కు అధికారిక కాఫీ భాగస్వామిగా కోస్టా కాఫీ ఇండియన్ బారిస్టాస్
న్యూస్‌తెలుగు/ముంబయి: కోస్టా కాఫీ పారిస్ 2024 ఒలింపిక్ గేమ్స్‌లో అధికారిక కాఫీ భాగస్వామి కావడం, ప్రపంచవ్యాప్తంగా భారతీయ బారిస్టాలకు ఒక కేంద్ర వేదికను అందించడంలో ఒక ముఖ్యమైన మైలురాయి అవుతుంది. ఆరు దేశాలకు చెందిన 130 కోస్టా కాఫీ టీమ్ సభ్యులు ఆరు కియోస్క్‌లు, 110 కంటే ఎక్కువ సెల్ఫ్-సర్వ్ పాక్టో మెషీన్‌లను ఉపయోగించి ప్యారిస్ అంతటా ఏడు ప్రదేశాలలో ప్రేక్షకులు, ఆటగాళ్లకు అత్యుత్తమ వేడి, చల్లటి పానీయాల అనుభవాలను అందిస్తారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా, కోస్టా కాఫీ మూడు అద్భుతమైన భారతీయ బారిస్టాలు: అమీర్ ఫయీజ్, మల్లికా త్రిపుర, అభిషేక్ కుమార్‌ను పరిచయం చేసింది. ఈ ప్రతిభావంతులైన వ్యక్తులు తమ నైపుణ్యాలను మెరుగుపర్చడానికి, కోస్టా కాఫీ టీమ్‌వర్క్, ఎక్సలెన్స్ విలువలను అందించచడానికి కఠినమైన శిక్షణ పొందినట్లు కోస్టా కాఫీ, కోకా-కోలా ఇండియా అండ్ ఎమర్జింగ్ ఇంటర్నేషనల్ జనరల్ మేనేజర్ వినయ్ నాయర్ అన్నారు.(Story: పారిస్ ఒలింపిక్స్‌కు అధికారిక కాఫీ భాగస్వామిగా కోస్టా కాఫీ ఇండియన్ బారిస్టాస్)