Homeవార్తలుశాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 6, జెడ్‌ ఫ్లిప్‌ 6లకు అపూర్వ స్పందన

శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 6, జెడ్‌ ఫ్లిప్‌ 6లకు అపూర్వ స్పందన

శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 6, జెడ్‌ ఫ్లిప్‌ 6లకు అపూర్వ స్పందన

న్యూస్‌తెలుగు/గురుగ్రామ్‌: భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ అయిన శాంసంగ్‌ తమ ఆరవ తరం ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌లు-గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 6, గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 6 కోసం రికార్డ్‌ స్థాయిలో ముందస్తు బుకింగ్‌లను అందుకున్నట్లు ప్రకటించింది. మొదటి 24 గంటల్లో, గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 6, జెడ్‌ ఫ్లిప్‌ 6 ప్రీ-ఆర్డర్‌లు మునుపటి తరం ఫోల్డబుల్‌లతో పోలిస్తే 40% అధికంగా జరిగాయి. తద్వారా కొత్త జెడ్‌ సిరీస్‌ భారతదేశంలో అత్యంత విజయవంతమైనదిగా నిలిచింది. గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 6 మరియు జెడ్‌ ఫ్లిప్‌ 6 ప్రీ-ఆర్డర్‌లు ప్రపంచంలోని ఇతర దేశాలతో పాటు భారతదేశంలో జూలై 10న ప్రారంభించబడ్డాయి. కొత్త స్మార్ట్‌ఫోన్‌లు, ఇటీవల విడుదల చేయబడిన ఎకోసిస్టమ్‌ పరికరాలతో పాటు-గెలాక్సీ వాచ్‌ అల్ట్రా, గెలాక్సీ వాచ్‌ 7, గెలాక్సీ బడ్స్‌ 3 ప్రో, గెలాక్సీ బడ్స్‌ 3-జూలై 24, 2024 నుండి భారతదేశంలో విక్రయించబడుతున్నాయి. వీటికి అపూర్వ స్పందన లభించడం ఆనందంగా ఉందని శాంసంగ్‌ ఇండియాఎంఎక్స్‌ బిజినెస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజు పుల్లన్‌ అన్నారు.(Story:శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 6, జెడ్‌ ఫ్లిప్‌ 6లకు అపూర్వ స్పందన)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments