ప్రియాంక చోప్రాతో హెచ్‌ఎస్‌బిసి కొత్త ప్రచారం
న్యూస్‌తెలుగు/ముంబయి: భారతీయ ప్రవాసులలో తమది అనే భావాన్ని పెంపొందించటానికి గ్లోబల్ సూపర్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్‌తో కొత్త ప్రచారాన్ని హెచ్‌ఎస్‌బిసి ప్రారంభించింది. ‘సినీ స్టార్‌తో భోజనం’ అనే ప్రచారం, మరపురాని స్వదేశీ రుచుల ద్వారా భారతీయ ప్రవాసులకు తమ మూలాల నుండి వేరు చేయబడిన భౌగోళిక అంతరాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. మిచెలిన్-స్టార్ రెస్టారెంట్ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ఈ సామాజిక ప్రయోగ ప్రచారం, ప్రియాంక చోప్రా జోనాస్ ప్రత్యేక హాజరుతో ముగ్గురు భారతీయ ప్రవాస జంటలను ఆశ్చర్యపరుస్తుంది. మా లక్ష్య ప్రేక్షకులైన ఉద్యోగ నిమిత్తం విదేశాలకు తరలివెళ్లే ఎన్నారైలతో కనెక్ట్ అయ్యేలా ఈ ప్రచారం రూపొందించబడిరది, లేదా విదేశాల్లో ఉన్న తమ కొత్త ఇంటికి ఇప్పటికే వచ్చిన వారికి వారి ప్రయాణంలో వారు ఎదుర్కొనే భావోద్వేగ సవాళ్లను మేము అర్థం చేసుకున్నామని చూపించడం ద్వారా, వారి మూలాలకు కనెక్ట్ అవ్వడంలో సహాయపడటానికి స్వదేశంలోని ప్రామాణికమైన ఆహారం శక్తిని వారికి గుర్తుచేస్తున్నారు.(Story:ప్రియాంక చోప్రాతో హెచ్‌ఎస్‌బిసి కొత్త ప్రచారం)