కేవీబీ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు వెల్లడి
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: కరూర్ వైశ్యాబ్యాంక్ 2024 జూన్ 30 నాటితో ముగిసిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలని ప్రకటించింది. ఈ సందర్భంగా కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్‌బాబు మాట్లాడుతూ, ‘‘ప్రగతి, లాభదాయికత, సొత్తు నాణ్యత అనే మూడు మార్గదర్శక ప్రమాణాల ఆధారంగా చేస్తున్న కృషి ఫలితంగా మరొక బలమైన త్రైమాసిక పనితీరుని కనబర్చగలిగామాన్నారు. బ్యాంక్ పనితీరు నిర్వహణా సూచికలు మా మార్గదర్శకాలకి అనుగుణంగానే వున్నాయనీ బ్యాంక్ స్థిరమైన ప్రగతిని సాధిస్తోందన్నారు. ఆర్‌ఎఎం విభాగాల్లో సమగ్ర అభివృద్ధి ఎంతో ప్రోత్సహకరంగా వుందనీ, ఈ ఆర్థిక సంవత్సరం బలంగా ప్రారంభమైందని ఇది ఎత్తిచూపుతోందన్నారు. ఇదే తీరు కొనసాగుతుందని, రాబోయే త్రైమాసికాల్లో పనితీరు మరింత మెరుగుపరుచుకోడాన్ని లక్ష్యంగా చేసుకుంటామని నమ్మకం వుంది అన్నారు. మొత్తం వ్యాపారం రూ. 1,70,059 కోట్లు దాటిందనీ, అన్ని వ్యాపార విభాగాల్లో కలిపి సాధించిన ప్రగతి ఈ త్రైమాసికలో రూ. 459 కోట్ల నికర లాభం పొందడానికి దోహదం చేసిందన్నారు. (Story : కేవీబీ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు వెల్లడి)