జీ తెలుగు, జీ సినిమాలు చానళ్లలో వీకెండ్ వినోదం
న్యూస్‌తెలుగు/నిజామాబాద్: తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో అత్యంత ఆదరణ గల రెండు ఛానళ్లు జీ తెలుగు, జీ సినిమాలు తమ ప్రేక్షకులను అలరించడానికి మరోసారి సిద్ధమయ్యాయనీ సంస్థ ప్రతినిదులు ఒక ప్రకటనలో తెలిపారు. జులై 20 శనివారం సాయంత్రం 6 గంటలకు జీ సినిమాలులో డీడీ రిటర్న్స్ (భూతాల బంగ్లా), జులై 21 ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో గామి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ప్రసారం కానున్నాయన్నారు. ఈ సినిమా కథ దశాబ్దాల క్రితం పాండిచ్చేరి శివార్లలోని ఒక రాజభవనంలో ప్రారంభమవుతుందన్నారు. వినోదంలో భాగంగా గామి సినిమా ఆదివారం ప్రసారం అవుతుందన్నారు. ‘గామి’ కథ మానవ స్పర్శ కారణంగా మూర్ఛపోయే అరుదైన సమస్యతో బాధపడుతున్న శంకర్ (విశ్వక్సేన్) అనే అఘోరా చుట్టూ తిరుగుతుందన్నారు. విశ్వక్సేన్, చాందినీ చౌదరి నటన మరిచిపోలేని అనుభూతినిస్తుంది. కామెడీతోపాటు సస్పెన్స్ థ్రిల్లింగ్ ఫీల్ని పొందాలంటే ఈ వారాంతంలో జీ సినిమాలు, జీ తెలుగులో ప్రసారం కానున్నదన్నారు. (Story : జీ తెలుగు, జీ సినిమాలు చానళ్లలో వీకెండ్ వినోదం)