వర్ల్‌పూల్ ఐస్ మ్యాజిక్ ప్రో గ్లాస్ డోర్ రిఫ్రిజిరేటర్ శ్రేణి విడుదల
న్యూస్‌తెలుగు/బెంగళూరు: అత్యుత్తమ సౌందర్యం, హస్తకళల సమ్మేళనంతో నూతన శ్రేణి సింగిల్ డోర్ రిఫ్రిజిరేటరు-ఐస్ మ్యాజిక్ ప్రో గ్లాస్ డోర్‌ను వర్ల్‌పూల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. భారతీయుల నివాసాలలో ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న ఆధునికీకరణతో అనుసంధానం చేసేందుకు ఉత్పత్తి సమర్పణ స్టైలిష్‌గా, సమకాలీనంగా ఉండాలని వర్ల్‌పూల్ విశ్వసిస్తోంది. గ్లాస్ డోర్‌పై ‘‘మునుపెన్నడూ చూడని’’ నమూనాలతో నూతన శ్రేణి అధునాతనతను, భారతీయ నివాసాలకు అందమైన లేయర్‌ను జోడిరచడం ద్వారా లివింగ్ స్పేస్‌ను మరింత సౌందర్యంగా చేస్తుంది. ఈ శ్రేణి మూడు విలక్షణమైన డిజైన్‌లు – గోల్డ్ డస్ట్, సిల్వియా మరియు నైట్ బ్లూమ్‌లలో లభిస్తుంది. ఇది భారతదేశంలోని కళలు, కళాకారులు, దాని విభిన్న సంస్కృతికి అద్దం పడుతుంది. తన ప్రత్యేక డిజైన్లతో మొత్తం శ్రేణి భారతదేశపు సౌందర్యం, విభిన్న సంప్రదాయాలను, ప్రకాశవంతమైన రంగులను ప్రతిబింబిస్తుంది. (Story : వర్ల్‌పూల్ ఐస్ మ్యాజిక్ ప్రో గ్లాస్ డోర్ రిఫ్రిజిరేటర్ శ్రేణి విడుదల)