లోకం మాధవి సమక్షంలో వైసీపీ నుంచి జనసేనలో చేరిక
విజయనగరం (న్యూస్ తెలుగు) : విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని చిన రావాడ పంచాయతీకి చెందిన 50 కుటుంబాలు, వైసీపీ పాలనకి విసుగు చెంది జనసేన పార్టీలో లోకం మాధవి ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు. చినరావాడ కి చెందిన ప్రాంతవాసులు మాట్లాడుతూ తమకు గత 20 ఏళ్ల నుండి కనీసం రోడ్డు సదుపాయం లేదని ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన తమకి ఓట్ల కోసం హామీ ఇచ్చి ఎన్నికల తర్వాత కనబడకుండా వెళ్లేవారే అని, ఆ మాటలు నమ్మే 2019లో పడుకున్నా అప్పలనాయుడు కి ఓట్లు వేసి గెలిపించామని, కానీ తమకి ఇప్పటివరకు చేసింది ఏమీ లేదని వెల్లడించారు. లోకం మాధవి సేవ, ప్రజల మీద ఆవిడకి ఉన్న ప్రేమను తమ ప్రాంతానికి మంచి చేస్తారని నమ్మకంతో జనసేన పార్టీలో చేరడం జరిగిందని ఆ ప్రజలు తెలియజేశారు. టీడీపీ, జనసేనల ప్రభుత్వాన్ని గెలిపించడానికి కార్యకర్తలు కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంలో లోకం మాధవి పిలుపునిచ్చారు. (Story: లోకం మాధవి సమక్షంలో వైసీపీ నుంచి జనసేనలో చేరిక)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!