విద్యాభివృద్ధితోనే ప్రగతి సాధ్యం
విద్యార్థులకు పరీక్ష కిట్స్ పంపిణీచేసిన ప్రదీప్ నాయుడు, సిరిసహస్ర
విజయనగరం (న్యూస్ తెలుగు : విజయనగరం జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ నియోజక వర్గంలోని గోవిందపురం, రావాడ పూసపాటిరేగ, అలుగోలు గ్రామాల్లోని జెడ్.పి.హెచ్.స్కూల్స్ పదవ తరగతీ విద్యార్థులకు యువ నాయకులు ప్రదీప్ నాయుడు, సిరిసహస్ర పరీక్ష కిట్స్ ను శనివారం పంపిణీ చేసారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రదీప్ నాయుడు, సిరిసహస్ర మాట్లాడుతూ పేదలకు, మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన విద్యను అందించే దిశగా జగనన్న ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నాడు – నేడు కార్య క్రమం ద్వారా పాథ శాలలను అందంగా తీర్చి దిద్ది, ప్రభుత్వ పాథశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టి విద్యార్దులకు కావలసిన మధ్యాహ్నభోజనం, ఉచిత పుస్తకాలు, యునిఫార్మ్స్ అందజేయడం ద్వారా ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని వారు కొనియాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న అమ్మవడి, విద్యాదీవన , గోరుముద్ద మొదలగు సదుపాయాలను ప్రతి ఒక్కరు సద్వినియోగంచేసుకొని తమ ప్రగతికి , దేశ ప్రగతికి తోడ్పడాలని వారు కోరారు . విధ్యాభి వృద్ధి తోనే ఆయా ఆయా ప్రాంతాల ప్రగతి ముడిపడి ఉంటుందన్నారు. దీనికోసమే జగన్న ప్రభుత్వం ప్రతీ సంవత్సరం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. అందువలనే విద్యార్ధులు క్రమ శిక్షణతో చదువుకుని మంచి ఫలితాలను సాధించాలన్నారు. నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతి చదువుతోన్న విద్యార్ధులను వారు ఆత్మీయంగా కలుసుకున్నారు. రానున్న పబ్లిక్ పరీక్షలకు శ్రద్ధగా చదువుకోవాలని, ఉన్నత శిఖరాలను అధి రోహించాలని కోరుతూ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు కావాల్సిన, సామాగ్రిని పంపిణీ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖాధికార్లు, ఉపాధ్యాయ బృందం, ప్రజా ప్రతినిధులు , విద్యార్ధులు, తల్లి దండ్రులు, తదితరులు ప్రభుత్వ పాఠశాలల ప్రగతి కోసం చేస్తున్న కృషికి వారు అభినందనలు తెలియజేశారు. (Story: విద్యాభివృద్ధితోనే ప్రగతి సాధ్యం)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!