పొదుపు చేయడం విద్యార్థి దశ నుండే నేర్చుకోవాలి
మండవల్లి (ఏలూరు-న్యూస్ తెలుగు) : భవిష్యత్తు ఆర్థికంగా స్థిరంగా ఉండేందుకు విద్యార్థి దశ నుండే ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండటం చాలాముఖ్యమని ఇండియన్ బ్యాంక్ మండవల్లి శాఖ మేనేజర్ బొంతు దుర్గారావు,ప్ర.ప.ఐక్యవే జిల్లా కన్వీనర్ ఎల్.ఎస్.భాస్కరరావు,వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ జి.రాజశ్రీ,సి.ఎఫ్.ఎల్ కౌన్సిలర్ పి.రాధ, దుర్గాప్రసాద్ అన్నారు. మండవల్లి మండలం లోకు మూడి గరువు వికాస్ డిగ్రీ కాలేజీలో సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీపై,ఆర్థిక అక్షరాస్యత కేంద్రం మండ వల్లివారి ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ టీవీ వెంకటే శ్వర రావు అధ్యక్షతన ఆర్థిక అక్షరాస్యత పై శుక్రవారం అవగాహన,చైతన్య కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మీ భవిష్యత్తు ఆర్థికంగా స్థిరంగా ఉండేందుకు పొదుపు ఒక మంచి మార్గం అని, కష్ట సమయంలో ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. పొదుపు చేయడం,బడ్జెట్ పెట్టడం, ఖర్చు చేయడం వంటి విషయాలపై విద్యార్థి దశ నుండే నేర్చుకోవాలన్నారు. పొదుపు చేయటానికి అలవాటు పడినవారు దుర్వేసనాల
జోలికి పోరన్నారు. డిజిటల్ లావాదేవీల సౌలభ్యం,ఆవశ్యకత,సైబర్నేరాలపై తీసుకోవలసిన జాగ్రత్తలపై,విద్యార్థులకు అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సామాజిక బీమా పథకాలైన పీఎం సురక్ష భీమా యోజన,జీవన్ జ్యోతి బీమాయో జన,అటల్ పెన్షన్ యోజన తదితర ప్రభుత్వ పథకాల పై అవగాహన కల్పించి,కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సిఎఫ్ఎల్ కౌన్సిలర్లు రాధా,దుర్గాప్ర సాద్ మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమంలో భాగంగా మండవల్లి,ముదినేపల్లి,కలి దిండి మండలాల్లోనీ రైతులు,చిన్న వ్యాపారులు
కళాశాల విద్యార్థులు,సహాయక బృందాలు,సీనియర్ సిటిజన్లలో మంచి ఆర్థిక పద్ధతులు డిజిటల్ వినియోగదారుల రక్షణ గురించి అవగాహన పెంపొందించే కార్యక్ర మాలు నిర్వహించనున్నట్లు తెలియపరిచారు.ఈ కార్యక్రమంలో బిసి సిహెచ్ వెంకట కళ్యాణి, సిసి ఎం. మాధవి డిగ్రీ విద్యార్థులు పాల్గొన్నారు. (Story: పొదుపు చేయడం విద్యార్థి దశ నుండే నేర్చుకోవాలి)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!