Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం

తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం

0

తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం

ఉండి నియోజకవర్గంలో పరిశీలకుల ఘెరావ్‌
శివ‌రామ‌రాజుకు సీటెందుకు ఇవ్వ‌లేదంటూ నిల‌దీసిన టీడీపీ కార్య‌క‌ర్త‌లు

ఉండి (న్యూస్ తెలుగు) : తెలుగుదేశం పార్టీ ఉండి నియోజకవర్గ పరిశీలకులు కొత్త నాగేంద్ర కుమార్ పై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం శివరామరాజు కార్యాలయంలో ఆదివారం శివరామరాజును ఒప్పించి మంతెన రామరాజుకి సహకరించాలని కోరిన పరిశీల‌కులపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నాయకుడు శివరామరాజుకి సీటు ఇవ్వక పోవడానికి గల కారణాలు ఏమిటో తెలియజేయాలని ప‌ట్టుబ‌ట్టారు. శివరామరాజు ప్రజల్లో లేరా అక్రమాలు చేశారా వ్యాపారాలు చేసుకుంటూ ప్రజలను వదిలేసారా తెలుగుదేశం పార్టీకి కాకుండా వేరే పార్టీలతో సంబంధాలు ఉన్నాయా ఏ కారణాలతో పార్టీ టికెట్ ఇవ్వలేదు చెప్పండి అంటూ నిల‌దీశారు. అది చెప్పలేకపోతే కనీసం శివరామరాజుతో టిక్కెట్ మార్పుపై సంప్రదించారా ఇవ్వలేను అని అయినా సమాచారం ఇచ్చారా ఏమీ చెప్పకుండా మా నాయకుడిని మీరు ఆ సమర్ధుడుగా భావించినప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చారు మా సత్తా ఏంటో మేము అధిష్టానానికి చాటు చూపుతాం దయచేసి మీరు వెళ్లిపోండి అంటూ పరిశీలకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శివరామరాజు నాయకత్వం వర్ధిల్లాలి.. జై శివరామరాజు.. జై జై శివరామరాజు అనే నినాదాలతో మారుమోగించారు. ఉండి నియోజకవర్గ పరిశీలకులుగా మీరు శివరామరాజు దగ్గరికి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని సార్లు వచ్చారు ఇంతవరకు రాని మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు అని ప్రశ్నించారు. మూటలకి అమ్ముడుపోయిన మీరా శివరామరాజుని ఓదార్చేది? గెలుపు గుర్రాలను పక్కనపెట్టి మూటలు ఇచ్చినవారికి అందలం ఎక్కించాలనుకున్న మీకు పతనం ఖాయమని, ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా శివరామరాజు పోటీలో ఉంటారని గెలిచి తన చట్ట చాటుకోవడం ఖాయమని వారన్నారు. (Story: తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం)

See Also

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version