Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ప్రజాక్షేత్రంలోనే ఉంటా.. నా సత్తా చూపుతా!

ప్రజాక్షేత్రంలోనే ఉంటా.. నా సత్తా చూపుతా!

0

ప్రజాక్షేత్రంలోనే ఉంటా.. నా సత్తా చూపుతా!

అవమానం జరిగిన చోటే పోటీ చేసి గెలిచి చూపిస్తా..

మరో రెండు రోజుల్లో నా నిర్ణయం ప్రకటిస్తా..

టీడీపీ అధిష్టానానికి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు స‌వాల్‌

ఉండి (న్యూస్ తెలుగు) : ప్ర‌జాక్షేత్రంలోనే ఉంటూ త‌న స‌త్తా ఏంటో పార్టీకి చూపిస్తాన‌ని ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు టీడీపీ అధినాయ‌క‌త్వానికి హెచ్చ‌రిక‌లు పంపించారు. పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తూ ఎంతో విధేయతగా అధిష్టానం ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ రెండుసార్లు ఉండి ఎమ్మెల్యేగా గెలిచి ఉండి నియోజకవర్గ సంపూర్ణ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తూ ప్రజల మన్ననలను పొందాన‌ని తెలిపారు. అధిష్టానం ఆదేశాల మేరకు నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన నన్ను తెలుగుదేశం పార్టీ ఆదరిస్తుందని ఆశపడి 2024 ఎన్నికల్లో ఉండి నియోజకవర్గ సీటు ఇస్తుందని ఎంత గానో ఆశపడ్డ న‌న్ను అధిష్టానం అవమానపరిచిందని కనీసం సమాచారం ఇవ్వకుండా సీట్లు ప్రకటించడం నా మనసును గాయపరిచిందని వేటుకూరి వెంకట శివరామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. భీమవరం తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివరామరాజు మాట్లాడుతూ. శివ స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు సేవ చేసుకుంటున్న నన్ను పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం పిలిపించి ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారని అనంతరం రెండు పర్యాయాలు ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా భారీ ఆదిత్యంతో గెలుపొంది మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచే తరుణంలో తక్కువ సమయంలోనే నరసాపురం పార్లమెంట్ సభ్యులుగా టిక్కెట్ ఇచ్చి పోటీ చేయమని చెప్పగా తనకు ఇష్టం లేకపోయినా అధిష్టానం ఆదేశాలను శిరసా వహిస్తూ తన చిరకాల మిత్రుడైన రఘురామకృష్ణం రాజు పై పోటీకి సిద్ధపడ్డానని వీటన్నింటినీ పరిగణన‌లోకి తీసుకోకుండా అర్ధాంతరంగా మోసం చేస్తూ సర్వేలను కూడా పక్కనపెట్టి డబ్బులు మూటలకు అమ్ముడుపోయారని గెలుపు గుర్రాలను పక్కన పెట్టిన పాపానికి ప్రాయశ్చిత్తం పడే సమయం తొందరలోనే ఉందని దానికి అధిష్టానం సిద్ధంగా ఉండాలని వారన్నారు. ఉండి పార్టీ టికెట్ ప్రకటించే ముందు కనీసం పిలిపించి మాట్లాడి ఉన్నా ఇంత బాధపడకపోయేవాడని ఒక అసమర్థుడులా భావించిన అధిష్టానానికి నా చెత్త చాటి చూపుతానని వారన్నారు. పార్టీ మీద అభిమానంతో పార్టీలు మారే ఆలోచన లేదని వచ్చిన అవకాశాలను వదులుకుంటున్నానని అధిష్టానం ఎప్పటికైనా పునరాలోచన చేసి నా సీటును నాకు ఇవ్వకపోతే ఉండి నియోజకవర్గం నుండి బరిలో ఉంటానని గెలిచి నా సత్తా చాటుకుంటానని వారు తెలిపారు. (Story: ప్రజాక్షేత్రంలోనే ఉంటా.. నా సత్తా చూపుతా!)

See Also

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version