డబ్బు లాక్కొని పంటను ట్రాక్టర్‌తో దున్నేశారు!
డబ్బు మొత్తం తీసుకున్నారు.. భూమి రిజిస్ట్రేషన్ చేయడం లేదు
నా పంట మొత్తాన్ని ట్రాక్టర్‌తో దున్నేశారు
నా పంటలకు నా ప్రాణాలకు రక్షణ కల్పించండి
చాట్రాయి (న్యూస్ తెలుగు) : దశాబ్దాల కాలం క్రితం మాకు భూమి అమ్మి మా దగ్గర డబ్బులు మొత్తం తీసుకుని మాకు భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా పదేపదే మా చేతికి వచ్చిన పంటలను ట్రాక్టర్‌తో దున్నివేస్తూ భూస్వామి నరకయాతన పెడుతున్నారని చెరుకు రత్న కుమారి అనే మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. చాట్రాయి మండలంలోని నరసింహారావు పాలెం పంచాయతీ పరిధిలో ఉన్న ఆర్ఎస్ నెంబర్ 1055/3లో 5 ఎకరాల 83 సెంట్లు, 1055/4లో 87 సెంట్లు భూమిని మందపాటి అమెరికా రెడ్డి మాకు గత కొన్ని సంవత్సరాల క్రితం అమ్మి నాకు భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా నరకయాతన పెడుతుంటే తట్టుకోలేక తన భర్త చనిపోయాడని ఆరు ఎకరాల 70 సెంట్లు భూమిలో మమ్ములను పంట పండించుకోనివ్వకుండా మేము సాగు చేసిన పంట చేతికొస్తున్న దశలో గురువారం రాత్రి ఎర్ర నువ్వుల చేను మొత్తం దున్నివేశారని పంటను చూపిస్తూ ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది. గతంలో కూడా అనేక సందర్భాల్లో వివిధ పంటలను దున్నివేశారని ఆరోపించారు. అమెరికా రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆమె భయభ్రాంతులకు గురౌతుంది. రెవెన్యూ పోలీసు అధికారులు తన భూమికి తనకు పంటలకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నది. (Story: డబ్బు లాక్కొని పంటను ట్రాక్టర్‌తో దున్నేశారు!)
See Also:
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!