Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ జనసేన గూటికి కొత్తపల్లి సోదరులు

జనసేన గూటికి కొత్తపల్లి సోదరులు

0

జనసేన గూటికి కొత్తపల్లి సోదరులు

నర్సాపురం (న్యూస్ తెలుగు): నరసాపురం మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు జనసేనలో చేరనున్నారు.మంచి ముహూర్తం చూసుకుని పార్టీలో ఈ నెలాఖరు లోగా కొత్తపల్లి సుబ్బరాయడు, మాజీ ఎమ్మెల్యే జానకీరామ్ జనసేనలో చేరనున్నారు. 2019ఎన్నికల్లో కి ముందు టీడీపీ కి రాజీనామా చేసి వైకాపా లో చేరిన కొత్తపల్లి సోదరులు 2019 వైసీపీ నుండి ప్రసాదరాజు గెలవడంలో సుబ్బరాయడు కీలకంగా వ్యవహరించారు. జిల్లా కేంద్రం భీమవరంకి తరలి పోవడంతో సొంత పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయటాన్ని వైసీపీ సస్పెండ్ చేసింది. సైలెంట్ గా కొత్తపల్లి ఒక్కసారిగా ఎన్నికల ముందు జనసేనలో చేరనున్నట్లు ఆయన అనుచరులు తెలిపారు. మరోవైపు నరసాపురం జనసేన ఇంచార్జ్ గా బొమ్మిడి నాయకర్ ఉన్నారు. సుబ్బారాయుడు జనసేనలో చేరితే టికెట్ నరసాపురం ఎమ్మెల్యే టిక్కెట్ ఎవరికో ఇస్తారోవేచి చూడాల్సి ఉంది.
ఎన్ టి ఆర్ సమయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా, చంద్రబాబు సమయంలో విద్యుత్ శాఖ మంత్రిగా సుబ్బరాయడు పనిచేసారు. మాజీ హోంమంత్రి చేగొండి హరిరామ జోగయ్య శిష్యుడు కొత్తపల్లి సుబ్బరాయడు. సాధారణ మున్సిపల్ కౌన్సిలర్ స్థాయి నుండి కొత్తపల్లి ఎంపీ స్థాయికి ఎదిగారు.ఇప్పటికే వరుసగా నాలుగుసార్లు, మొత్తం గా 5 సార్లు ఎమ్మెల్యే గా,ఒక్కసారి ఎంపీ గా పనిచేసారు. 2009లో కొత్తపల్లి టీడీపీ కి రాజీనామా చేసి ప్రజారాజ్యంలో చిరంజీవి, పవన్ తో పనిచేసిన అనుబంధం ఉంది. సుబ్బారాయుడు చివరిగా 2012 ఉప ఎన్నికలలో ఎమ్మెల్యే గా పనిచేసారు.
2014 టిడిపి అభ్యర్థి బండారు మాధవ నాయుడు చేతిలో ఓటమి పాలయ్యాడు. 2019 ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండి వైకాపా తరఫున నిలబడిన ముదునూరు ప్రసాద్ రాజు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. (Story: జనసేన గూటికి కొత్తపల్లి సోదరులు)

See Also: 

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version