పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలి
జేఏసీ డిమాండ్
పోలవరం (న్యూస్ తెలుగు): పోలవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయాలని పోలవరం జేఏసీ డిమాండ్ చేసింది. మంగళవారం పోలవరం జేఏసీ ఆధ్వర్యంలో ఏటిగట్టు సెంటర్ వద్ద భారీ బహిరంగ సభ ను నిర్వహించారు. ఈ సమావేశానికి స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నాయకులు పార్టీలకతీతంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, జేఏసీ కన్వీనర్ నాళం గాంధీ, మాజీ శాసనసభ్యులు మొడియం శ్రీనివాసరావు, సభ్యులు శబ్దం మోహన్ మాట్లాడుతూ, పోలవరం జిల్లాగా ఏర్పాటు చేయడం ద్వారా ప్రాజెక్టు ముంపు ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు న్యాయం జరుగుతుందన్నారు. పశ్చిమ ఏజెన్సీ గిరిజన మండలాలైన జిలుగుమిల్లి, బుట్టయిగూడెం, వేలేరుపాడు, కుక్కునూరు, వి ఆర్ పురం, ఏటిపాక, చింతూరు కూనవరం తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం, రంపచోడవరం, సీతానగరం బూర్గంపాడు మండలాలకు రాకపోకలకు అనువుగా ఉంటుందన్నారు. రంపచోడవరం ఏజెన్సీ నుంచి 250 కి.మీ దూరంలో జిల్లా కేంద్రం పాడేరు ఉండటంతో ఇక్కడి గిరిజన గిరిజన ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారని గుర్తు చేశారు.
అన్ని అనుకూల అంశాలు ఉన్నాయి కాబట్టి పోలవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని జేఏసీ సభ్యులు హెచ్చరించారు. ముందుగా ఏటి గట్టు సెంటర్ వద్ద విద్యార్థులు మానవహారం నిర్వహించి, కమిటీ ఆధ్వర్యంలో వంట వార్పు చేపట్టారు. (Story: పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలి)
See Also:
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!