టీటీడీ ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు
విజయనగరం (న్యూస్ తెలుగు) : తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో విజయనగరం, మన్యం జిల్లాలలో విద్యార్థులతో రథసప్తమి పండుగను పురస్కరించుకొని విద్యార్థులతో సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ పారాయణం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు టిటిడి ప్రోగ్రాం అధికారి కె శ్యాంసుందర్ తెలిపారు. దీనికి సంబంధించిన ఫ్లెక్సీ బోర్డులను బుధవారం టీటీడీ కళ్యాణ మండపం ఆవరణంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాలను విజయనగరం జిల్లాలో జిల్లా పరిషత్ పాఠశాలలో, మన్యం జిల్లాలో కొమరాడ మండలంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పివి నరసింహులు, ఎస్ వెంకట రాజు, తదితరులు పాల్గొన్నారు. (Story: టీటీడీ ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు)
See Also:
బ్యూటిఫుల్ లవ్‌స్టోరి ఉషా పరిణయం
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!
‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2