చంద్రబాబునాయుడు అరెస్ట్!
నంద్యాల : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను నంద్యాలలో పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడకు తరలించారు. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ను మహానందిలో అరెస్ట్ చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే లు బీసీ జనార్ధనరెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జయనాగేస్వరరెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి, నాయకులు భూమా జగత్ విఖ్యాత రెడ్డి తో పాటు కొందరు నాయకులను బండి ఆత్మకూరు పొలీస్ స్టేషన్ కు తరలించారు. అర్ధరాత్రి నుంచి పోలీసులు చంద్రబాబు నాయుడును అరెస్ట్ కు ప్రయత్నం చేశారు. ఉదయం అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఆయన బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు ఈ ఉదయం 5 గంటల సమయంలో అరెస్ట్ చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద ఆయనను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. టిఫిన్ అనంతరం చంద్రబాబును విజయవాడ తరలించేందుకు సీబీఐ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అంతకుముందు చంద్రబాబును అరెస్ట్ చేయబోతున్నారన్న వార్తతో నంద్యాలలో కలకలం రేగింది. టీడీపీ నేతలు కాలువ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియ, జగత్ విఖ్యాత్‌రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి తదితర నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. (Story: చంద్రబాబునాయుడు అరెస్ట్!)
See Also
‘సైమా’ కోసం ఎక్సయిటెడ్ గా ఎదురుచూస్తున్నాను
నటుడు త్రిగుణ్ నివేదితల వివాహ వైభోగం!
అత్యధికంగా అనుసరిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా పుష్ప 2
హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్!
కన్నీళ్లు ఆరకముందే… మళ్లీ వరద!
హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!
షూటింగ్‌లో ఉపవాసం చేసిన పవర్‌స్టార్!
మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వచ్చేసింది!
చికెన్ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం
వివేకా హత్య కేసులో ఆ నివేదికలే కీలకం!
షాకింగ్ న్యూస్: హీరో అబ్బాస్ ఇప్పుడు కారు డ్రైవరా?
బిగ్‌బాస్ సొహైల్‌కు కడుపొచ్చింది!
‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్
https://www.youtube.com/@abtimes106