Home టాప్‌స్టోరీ 200 సినిమాల్లో నటించాను..

200 సినిమాల్లో నటించాను..

0
200days in move
200days in move

200 సినిమాల్లో నటించాను..

రుద్రాంగి టాప్ 10లో ఉంటుంది..

ప్రైమ్ లో మిస్ అవ్వద్దు: జగపతిబాబు

వర్సటైల్ యాక్టర్ జగపతిబాబు ప్రధాన పాత్రలో అజయ్ సామ్రాట్ తెరకెక్కించిన సినిమా రుద్రంగి. జులై 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు అక్కడ మంచి గుర్తింపు వచ్చింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఎలాంటి సందడి లేకుండా.. ప్రచారం లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. స్వాతంత్ర అనంతరం తెలంగాణలో జరిగిన సాంఘిక పరిస్థితుల నేపథ్యంలో వాస్తవ సంఘటన ఆధారంగా అజయ్ సామ్రాట్ సినిమాను తెరకెక్కించారు. ఇందులో భీమ్ రావు దేశ్ ముఖ్ పాత్రలో నటించిన జగపతిబాబు.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలైన ఈ సినిమా ఎలాంటి ప్రచారం లేకుండానే ఇండియాలో నెంబర్ 8లో ట్రెండ్ అవుతుందని.. ఈ సినిమాలో అందరూ చూసి ఆనందించాలని ఆయన కోరారు. తన కెరీర్ లో ఇప్పటివరకు 200 సినిమాల్లో నటించానని.. అందులో పర్ఫార్మెన్స్ పరంగా టాప్ 10 లో రుద్రంగి సినిమా ఉంటుందని తెలిపారు జగపతిబాబు. ఇందులో అద్భుతమైన కథ ఉంటుందని డైరెక్షన్ పరంగా కూడా రుద్రాంగి మరో స్థాయిలో ఉంటుందని చెప్పారు. తనతోపాటు విమల రామన్ మమత మోహన్ దాస్ క్యారెక్టర్స్ అద్భుతంగా ఉంటాయని.. అందరూ రుద్రంగి సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరారు జేబీ. కేవలం వినోదం మాత్రమే కాదు ఈ సినిమాలో తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి అని ఆయన తెలిపారు.    (Story  :  200 సినిమాల్లో నటించాను..)

See Also

Bro Success Celebrations

హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్‌!

క‌న్నీళ్లు ఆర‌క‌ముందే… మ‌ళ్లీ వ‌ర‌ద‌!

హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!

షూటింగ్‌లో ఉప‌వాసం చేసిన ప‌వ‌ర్‌స్టార్‌!

మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వ‌చ్చేసింది!

ఆ చేప కన్పిస్తే…సునామీనే!

చికెన్‌ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం

వివేకా హ‌త్య కేసులో ఆ నివేదిక‌లే కీల‌కం!

షాకింగ్‌ న్యూస్‌: హీరో అబ్బాస్‌ ఇప్పుడు కారు డ్రైవరా?

ప్రేమలో సంతోషం, బాధ అన్నీ..!

బిగ్‌బాస్ సొహైల్‌కు క‌డుపొచ్చింది!

‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్

స‌రికొత్త లుక్‌లో వ‌రుణ్ తేజ్

https://www.youtube.com/@abtimes106

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version