సిద్ధార్థ కళాశాలలో ఘనంగా గుఱ్ఱం జాషువా వర్ధంతి
విజయవాడ : పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో గుఱ్ఱం జాషువా వర్ధంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రాచార్యులు (ప్రిన్సిపల్) డాక్టర్ మేకా రమేష్ మాట్లాడుతూ గుఱ్ఱం జాషువా రాసిన ‘గబ్బిలం’ సాహిత్య చరిత్రలో ఒక మైలురాయి అన్నారు. తెలుగు సాహిత్యంలో మొదటి దళితకవిగా పేరు గాంచారని తెలిపారు. కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు మాట్లాడుతూ కాళిదాసు రచించిన మేఘసందేశంతో పోల్చదగినది గబ్బిలం కావ్యమని అన్నారు. కళాశాల డీన్ రాజేష్ సి. జంపాల మాట్లాడుతూ విశ్వనరుడుగా ఖ్యాతిగాంచిన జాషువా మొదట ఉపాధ్యాయుడుగా, ఆల్ ఇండియా రేడియో వర్డ్ ప్రొడ్యూసర్‌గా ఇలా అనేక వృత్తులలో సేవలందించి, అంచెలంచలుగా ఎదిగి సాహిత్య అకాడమీ అవార్డు సైతం పొందారన్నారు. తెలుగు శాఖాధ్యక్షులు డాక్టర్ ఎన్. శివకుమార్ మాట్లాడుతూ గుఱ్ఱం జాషువా ఎక్కడైతే ఉన్నత వర్గాలచేత ఛీత్కరించబడ్డాడో వారిచేతనే సత్కరించబడిన వారని, నేటి తరానికి ఆయన స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని అన్నారు. ఈ సభలో తెలుగుశాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.నీరజ గబ్లిలంలోని ముత్యాల్లాంటి పద్యాలను ఆలపించి, ఆ కావ్యం ఎంత ప్రభావవంతమైందో విద్యార్థులకు వివరించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ.వి. రమణమూర్తి ఫిరదౌసి కావ్య విశిష్ఠతను గురించి వివరించారు. ఈ సభలోని ప్రసంగాలను విద్యార్థులు ఆసాంతం ఉత్సాహంగా ఆలకించారు. ఈ సభలో ముందుగా గుఱ్ఱం జాషువా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. (Story: సిద్ధార్థ కళాశాలలో ఘనంగా గుఱ్ఱం జాషువా వర్ధంతి)
హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!
షూటింగ్లో ఉపవాసం చేసిన పవర్‌స్టార్!
మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వచ్చేసింది!
చికెన్ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం
వివేకా హత్య కేసులో ఆ నివేదికలే కీలకం!
షాకింగ్ న్యూస్: హీరో అబ్బాస్ ఇప్పుడు కారు డ్రైవరా?
బిగ్‌బాస్ సొహైల్‌కు కడుపొచ్చింది!
‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్
https://www.youtube.com/@abtimes106