వెలుగులో జరిగిన కోటికి పైగా అవినీతిపై ఉన్నత అధికారులు మౌనం.సీపీఎం
న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు వెలుగు ప్రాజెక్ట్ లో రు. కోటి కి పైగా అవినీతి జరిగినా అధికారులు మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం సి పి యం పార్టీ ఆఫీస్ లో జరిగిన సమావేశం లో పార్టీ మండల కార్యదర్శి పల్లపు వెంకట్ మాట్లాడుతూ చింతూరు మండలంలో వెలుగులో కోటికి పైగా అవినీతి జరిగినా అనేక దఫాలుగా గ్రూప్ సభ్యులు ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేసిన అధికారులు మౌనం వహిస్తున్నారు. గతంలో ఉన్న వెలుగు అధికారులు ఆధ్వర్యంలో అవినీతి జరిగింది. కోటికి పైగా అవినీతి జరిగింది గ్రూప్ సభ్యులు అమాయకులు బలైపోతున్నారు. కొత్తగా అప్పు తీసుకుందామంటే మీ పేరు మీద లోన్ తీసుకున్నారు.కాబట్టి మీకు కొత్తగా అప్పు రాదని అధికారులు చెబుతున్న దానివలన గ్రూప్ సభ్యులు హార్దిక ఇబ్బందుల్లో తున్నారు. అవినీతి జరిగిందని కంప్లైంట్ పెట్టగా సర్ఫ్ నుండి వచ్చిన కమిటీ కూడా కోటికి పైగా వెలుగులో అవినీతి జరిగిందని రిపోర్టు ఇచ్చినా కూడా. జిల్లా కలెక్టర్ ఐ టి డి ఏ పి ఓ. మౌనం వహిస్తున్నారు. సమస్య పరిష్కారం చేయకపోతే గ్రూప్ సభ్యులందరికీ కూడా ఐక్యం చేసి పోరాటం చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు మోట్టం రాజయ్య. పోడియం లక్ష్మణ్. మాజీ జెడ్పిటిసి ముర్రం రంగమ్మ. పార్టీ మండల కమిటీ సభ్యులు కారం సుబ్బారావు. చింత రాంబాబు. కారం నగేష్. సవలం కన్నయ్య. సోడి దుర్గారావు. తదితరులు పాల్గొన్నారు.(Story :వెలుగులో జరిగిన కోటికి పైగా అవినీతిపై ఉన్నత అధికారులు మౌనం.సీపీఎం )
