ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారం హైలైట్స్!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న 25 మంది సభ్యులు సోమవారం ఉదయం 11.31 గంటలకు అక్షర క్రమంలో ప్రమాణస్వీకారం చేశారు.
⊗ సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై నూతన కేబినెట్ మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.
⊗ నూతన కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన సీఎం వైయస్.జగన్.
1) అందరికన్నా ముందుగా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రమాణ స్వీకారం చేశారు.
2) అంజాద్ బాషా (కడప నియోజక వర్గం, మైనారిటీ) ప్రమాణ స్వీకారం. మంత్రిగా అంజాద్ బాషా అల్లా సాక్షిగా అంటూ ప్రమాణ స్వీకారం చేశారు.
3) ఆదిమూలపు సురేష్ ప్రమాణ స్వీకారం. రాష్ట్ర మంత్రిగా ఆది మూలపు సురేష్ ఇంగ్లీష్ లో ప్రమాణ స్వీకారం చేశారు.
4) బొత్స సత్యనారాయణ(చీపురుపల్లి) మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
5) బుడి ముత్యాల నాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
6) బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి (డోన్ నియోజక వర్గం) రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
7) చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ (బీసీ సామాజిక వర్గం) రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
8) దాడి శెట్టి రాజా (తుని నియోజక వర్గం, కాపు సామాజిక వర్గం) రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
9) ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం నియోజక వర్గం, వెలమ సామాజిక వర్గం, 5సార్లు ఎమ్మెల్యే, మూడు సార్లు మంత్రి) రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
10) గుడివాడ అమర్నాథ్ (అనకాపల్లి నియోజక వర్గం, తొలిసారి ఎమ్మెల్యే) రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి పాదాభివందనం చేశారు.
11) గుమ్మనూరు జయరాం (ఆలూరు, బోయ సామాజిక వర్గం, రెండు సార్లు ఎమ్మెల్యే, ఒక సారి మంత్రి) రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
12) జోగి రమేష్ (పెడన, గౌడ సామాజిక వర్గం, రెండు సార్లు ఎమ్మెల్యే) రాష్ట్ర మంత్రిగా దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
13) కాకాణి గోవర్ధన్ రెడ్డి (సర్వేపల్లి, రెడ్డి సామాజిక వర్గం, రెండు సార్లు ఎమ్మెల్యే) రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
14) కారుమూరి వెంకట నాగేశ్వరరావు (తనుకు) బీసీ సామాజిక వర్గం, రెండుసార్లు ఎమ్మెల్యే) రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
15) కొట్టు సత్యనారాయణ (తాడేపల్లి గూడెం, కాపు, రెండు సార్లు ఎమ్మెల్యే) రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
16) కే. నారాయణ స్వామి (గంగాధర నెల్లూరు, ఎస్సీ, రెండు సార్లు ఎమ్మెల్యే) రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
17) కే. వీ ఉషాశ్రీ చరణ్ (కళ్యాణదుర్గం, బీసీ కురుప సామాజిక వర్గం, తొలిసారి ఎమ్మెల్యే) రాష్ట్ర మంత్రిగా ఇంగ్లీష్ లో ప్రమాణ స్వీకారం చేశారు.
18) డాక్టర్ మేరుగ నాగార్జున (బాపట్ల జిల్లా వేమూరు, ఎస్సీ, తొలిసారి ఎమ్మెల్యే) రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
19) పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, ఏడు సార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు మంత్రి) రాష్ట్ర మంత్రిగా ఇంగ్లీష్ లో ప్రమాణ స్వీకారం చేశారు.
20) పినిపే విశ్వరూప్ (అమలాపురం నియోజక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం) రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
21) పీడిక రాజన్న దొర (సాలూరు, ఎస్టీ సామాజిక వర్గం, రెండు సార్లు ఎమ్మెల్యే ) రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
22) ఆర్కే. రోజా (నగరి నియోజక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, రెండు సార్లు ఎమ్మెల్యే, )రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
23) డాక్టర్ సీదిరి అప్పల రాజు (పలాస నియోజక వర్గం, తొలి సారి ఎమ్మెల్యే) రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
24) తానేటి వనిత (కొవ్వూరు, ఎస్సీ సామాజిక వర్గం) రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
25) విడదల రజని (చిలకలూరిపేట నియోజక వర్గం, బీసీ సామాజిక వర్గం) రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఉదయం గం.11.31 నిముషాలకు ప్రారంభమైన ప్రమాణ స్వీకార కార్యక్రమం గం. 12.26 నిముషాలకు ముగిసింది.
॥ ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మంత్రులు గ్రూపు ఫొటో దిగారు. ఆ వెంటనే సచివాలయంలో గవర్నర్, సీఎం, కొత్త, పాత మంత్రులు, అధికారులు తేనీటి విందుకు హాజరయ్యారు. (Story: ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారం హైలైట్స్!)
See Also:
బాలినేనికి మంత్రిపదవి దక్కకపోవడానికి కారణాలివేనా?
ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రులు వీరే! (Full Details)
మీడియాపై మంత్రి పేర్ని నాని ఉద్వేగపూరిత వ్యాఖ్యలు
మంత్రుల పేషీల్లోని అధికారులకు షాక్..!
పింఛను డబ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!
చనిపోయాడని పూడిస్తే…బతికొచ్చాడు!
రామ్‌గోపాల్‌వర్మకు ధియేటర్ల షాక్!
స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : కటకటాల్లో టీచర్
రామ్‌చరణ్‌తో బిగ్ డీల్ నిజమేనా?
ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!
వావ్! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!