మేకపాటి గౌతమ్‌రెడ్డి స్థానంలో మంత్రి ఎవరో తెలుసా?
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇటీవల గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో మంత్రివర్గంలో కూడా ఒక పోస్టు ఖాళీ అయింది. ఇప్పుడు ఆ శాఖలను ముఖ్యమంత్రే స్వయంగా చూసుకుంటున్నారు. అర్జెంటుగా ఆ శాఖలకు కొత్త మంత్రిని నియమించాల్సి వుంటుంది. కాకపోతే రానున్న పది రోజుల్లో ఎలాగూ మంత్రివర్గ విస్తరణ జరగబోతున్నది. ఈ ప్రక్రియలో భాగంగానే మేకపాటి గౌతంరెడ్డి స్థానాన్ని ఎవరితో భర్తీ చేద్దామన్న ఆలోచనలో సీఎం ఉన్నారు. అయితే గౌతంరెడ్డి మృతితో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్వహించే ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ తరఫున గౌతమ్ భార్య శ్రీకీర్తిని పోటీ చేయించే అవకాశమున్నట్లు ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మేకపాటి గౌతమ్ రెడ్డి భార్య శ్రీకీర్తిని పోటీ చేయించనున్నట్లు వైసిపి వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అయితే ఆమె పోటీ చేస్తారా? లేదా? అనేది మేకపాటి కుటుంబం ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. ఒకవేళ ఆమె పోటీ చేస్తే ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి పోటీ చేయకపోవచ్చని, దీంతో ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఉంటాయని ఆ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగి ఆమె ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత గౌతంరెడ్డి స్థానంలో ఆమెను మంత్రిగా ఎందుకు తీసుకోకూడదు? గౌతంరెడ్డి అంటే వైఎస్ జగన్‌కు ఎంతో అభిమానం కూడా. ఒక గొప్ప మిత్రుడిని కోల్పోయినట్లు పలుమార్లు ఆయన వ్యాఖ్యానించారు. గౌతంరెడ్డి లేనిలోటును భర్తీ చేయడానికి శ్రీకీర్తిరెడ్డికి మంత్రిపదవి ఇచ్చే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామనారాయణరెడ్డి మంత్రిపదవి రేసులో ఉన్నప్పటికీ, శ్రీకీర్తిరెడ్డికి కూడా అవకాశం వుండవచ్చని, కాకపోతే ఏదో ఒక శాఖను అప్పగిస్తారని అంటున్నారు. కాగా, ఆత్మకూరు ఉపఎన్నిక నిర్వహించే అంశంపై ఎన్నికల సంఘం ఇంకా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. (Story: మేకపాటి గౌతమ్‌రెడ్డి స్థానంలో మంత్రి ఎవరో తెలుసా?)
See Also: మాకొద్దీ మంత్రిగిరీ! Special Story)
See Also: ఎంత దారుణం : శవంతో సెక్స్!
రామ్‌చరణ్‌తో బిగ్ డీల్ నిజమేనా?
క్యాబినెట్ విస్తరణ ముహూర్తం కుదిరింది!
ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!
వావ్! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!
రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్ : బడ్జెట్ రూ.800 కోట్లు
ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)