వావ్! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!
లేపాక్షి ఆలయంకు మహర్దశ
-యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు
లేపాక్షి: బండ రాతిపై భక్తి దెబ్బలతో రాత్రికి ప్రాణం పోసి రత్నం లాంటి రూపాన్ని. కంటి చూపు మేరలో కంటి రెప్ప లాగా… చూపుడు వేలు కాదు చిటికెన వేలు ఘోర లాంటి చిత్రాలు ఎన్నో శిల్పకళల ఎన్నో… రెక్కలు తెగిన పక్షినీ… సైతం ఆనాటి రారాజు శ్రీరామచంద్రుడి తాకిన నేలపై. సాక్షాత్తు. ఆదిదేవుడై. భిక్షాటన మూర్తిగా. అన్నం పెట్టే అన్నపూర్ణేశ్వరి రూపాలను చూపిన శిల్పుల… ఆకిలి అరగంట ఆపి ఆకాశమే ఆశ్చర్యపోయే… ఏడు చీరల నాగేంద్రుని నేలకు దించారు… రూప సంకల్పమే లేపాక్షి ఆలయం.
లేపాక్షి శిల్పకళకు, వర్ణచిత్రాలకు నిలయమైన లేపాక్షిని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించి తాత్కాలిక జాబితాలో చేర్చడం గొప్ప పరిణామంగా చెప్పవచ్చు. భారత్ నుంచి మూడు ప్రాంతాలకు యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు లభించగా అందులో జిల్లాలోని లేపాక్షి ఆలయం కూడా ఉంది. అయితే శాశ్వత ప్రాతిపదికను గుర్తించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం వుంది. శాశ్వత ప్రాతిపదికన లేపాక్షికి చోటు లభిస్తే ఏపి నుంచి యునెస్కో గుర్తింపు పొందిన తొలి ఆలయంగా చరిత్రకు ఎక్కుతుంది. దీని వల్ల ప్రాచుర్యం బాగా లభించి పర్యాటకుల తాకిడి పెరుగుతుందని భక్తులు, పర్యాటకులు అభిప్రాయ పడుతున్నారు. భారత దేశంలో అతి పెద్ద నంది విగ్రహముగల దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా లేపాక్షి మండల కేంద్రంలో ఉండటం విశేషం. ఈ దేవాలయం 15 వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో విరుపణ్ణ, వీరణ్ణ అనే సహోదరులచే నిర్మించబడినది . ప్రాచీన చిత్ర, శిల్ప కళలకు కాణాచిగా పేరుగాంచినది. దేశ. విదేశాలలో లేపాక్షి చీరలు, డిజైన్సు బార్డర్లకు విశేష ఆదరణ పొందినది. ఈ దేవాలయం నందు వీరదద్రస్వామి, పాపనాశేశ్వరస్వామి, రఘునాథస్వామి, దుర్గాదేవి, నాగేంద్రుని విగ్రహం వున్న బండపై బండపై సాలే పురుగు, భక్తకన్నప్ప, సర్పము, ఏనుగు, శివలింగాలకు పూజలు చేస్తున్నట్టు మలిచినారు. దీనిని బట్టి శ్రీకాళహస్తి ఆలయం ఈ ఆలయం కంటే ముందుగా నిర్మించారని తెలుస్తోంది. ఈ దేవాలయం మొత్తం ఏడు ప్రాకారాలు ఉండగా, ప్రస్తుతం మూడు ప్రాకారాలతో శిల్పకళా వైభవం కళ్ళకు కట్టినట్టు కనపడుతూ ఉంటుంది. ప్రతి ఏడాది నవరాత్రులలో ప్రతి రోజు దుర్గా దేవి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటది. శివరాత్రి పర్వదినాన అత్యంత శోభాయమానంగా శివపార్వతుల రథోత్సవం జరుగుతుంది.
శిల్పకళా నైపుణ్యతను యునెస్కో గుర్తించింది -ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి.
లేపాక్షి విజయనగర రాజుల కాలంలో నిర్మించిన లేపాక్షి ఆలయం శిల్పాలకు , చిత్ర లేఖనాలకు ప్రసిద్ది చెందింది . ఈ దేవాలయంలో అపురూపమైన శిల్పాలు , తైలవర్ణ చిత్రాలు ఎంతో అద్భుతంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా వున్నాయి . ఈ ఆలయంను యునెస్కో గుర్తించడం వలన దేవాలయం బాగా అభివృద్ధి చెందుతుందని . పర్యాకుల రద్దీ పెరిగి ప్రభుత్వం నుండి మంచి నిధులు మంజూరు అవుతుందన్నారు . అంతేకాకుండా యాత్రికులకు వసతులు , సౌకర్యాలు సమకూర్చ వచ్చన్నారు . ముఖ్యంగా లేపాక్షి ఆలయం విశిష్టత బాగా ప్రాచుర్యంలోకి వస్తుందన్నారు .
లేపాక్షి ఆలయంకు నవశకం: సూర్యప్రకాశరావు, ప్రధాన అర్చకులు లేపాక్షి.
వీరభద్రస్వామి దేవాలయంను ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించడం పట్ల ఆలయంకుమహర్దశ ఏర్పడింది . దీని వలన యాత్రికుల సంఖ్య బాగా పెరిగి ఆదాయం పెరిగే అవకాశం వుంది . లేపాక్షి ఆలయం మరింత అభివృద్ధి చెందుతుంది . ప్రతి రోజు ప్రత్యేక పూజలతో పాటు ధూపదీప నైవేద్యాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతాయి . ఈ ఆలయంలో ప్రతి ఏడాది మహాశివరాత్రి ఉత్సవాలు శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని అందులో వీరభద్రస్వామి , దుర్గాదేవి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు జరుగుతాయని తెలిపారు. (Story: వావ్! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!)
See Also: మళ్లీ పెరిగిన ఆర్‌టిసి ఛార్జీలు
రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్ : బడ్జెట్ రూ.800 కోట్లు
ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)
తొలిరోజే ఆర్‌ఆర్‌ఆర్ కలెక్షన్ల తుఫాన్!