Home వార్తలు టీనేజ్ కుర్రాడికి  పెళ్ళైన అమ్మాయి కి మధ్య…!

టీనేజ్ కుర్రాడికి  పెళ్ళైన అమ్మాయి కి మధ్య…!

0
69 Samskar Colony
69 Samskar Colony

టీనేజ్ కుర్రాడికి  పెళ్ళైన అమ్మాయి కి మధ్య…!

టీనేజ్ కుర్రాడికి  పెళ్ళైన అమ్మాయి కి మధ్య జరిగే ఉద్వేగభరితమైన ప్రేమ కథ #69 సంస్కార్ కాలనీ చిత్రం – సునీల్ కుమార్ రెడ్డి

సమాజంలో జరిగే విషయాలు వాటి సమస్యలు ప్రధాన కథగా తీసుకుని ఒక అందమైన కథనం తో మంచి చిత్రాలు అందించిన దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి. ఆయన గతంలో తీసిన వలస, గల్ఫ్ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు పొందితే రొమాంటిక్ ఇతివృత్తాలు తీసినప్పుడు ప్రేక్షకుల మెప్పు కూడా పొందాయి. ఇప్పుడు #69 సంస్కార్ కాలనీ పేరుతో మరో కథా చిత్రం తో మార్చి 18న మన ముందుకు వస్తున్నారు. శ్రీ లక్ష్మీ పిక్చర్స్, ఆదిత్య సినిమా పతాకంపై ఎస్తర్ నోరోన్హా, రిస్వి తిమ్మరాజు, అజయ్ ప్రధాన పాత్రల్లో పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో బి బాపిరాజు, ముతికి నాగ సత్య నారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “#69 సంస్కార్ కాలనీ . ఈ చిత్రం మార్చి 18న విడుదల కు సిద్ధంగా ఉంది.

చిత్ర వివరాలు తెలియజేస్తూ “సినిమా చాలా బలమైన మీడియం. సమాజంలో జరుగుతున్న విషయాలను మంచి కథనం తో చెప్తే ప్రేక్షకులకు బాగా అర్థం అవుతుంది. రెండు గంటల సినిమా కనీసం రెండు రోజులు అయిన ఆలోచింపజేయాలి. నా ప్రతి సినిమా ఆ సంకల్పంతో చేసినవే. ఈ #69 సంస్కార్ కాలనీ చిత్రం కూడా ప్రతి ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తుంది. సంస్కార్ కాలనీ చిత్రం ఆడవాళ్ళ సున్నిత మానసిక చిత్రంగా చూపించే ఒక సినిమా అందుకే స్వాతి అనే అమ్మాయి ని మా స్టోరీ డిపార్ట్మెంట్ లోకి తీసుకున్నాము.

ఈ చిత్రం మానవ సంబంధాలలో వస్తున్న మార్పుల గురించి , సమాజంలో జరుగుతున్న వింత పోకడలు గురించి చెప్పే సినిమా.  ఇందులో ఒక టీనేజ్ కుర్రాడికి  ఒక పెళ్ళైన అమ్మాయి కి మధ్య జరిగిన ఉద్వేగభరితమైన ప్రేమ కథ. దానికి అనుకూలించిన కారణాలు వాటి వల్ల వస్తున్న సమస్యల గురించి చెప్పేదే ఈ సినిమా.

ఇలాంటి కథలు వచ్చాయి కానీ కొత్త కోణం లో చూపించాము. ఇప్పటివరకు ఏ సినిమాలో చూపించని విషయాలను ఈ చిత్రంలో చుపించాము. కొన్ని విషయాలను ఓపెన్ గానే బలంగా చెప్పాను.

నా చిత్రానికి ఏ సర్టిఫికెట్ వచ్చింది. పరిణతి చె౦దిన ప్రేక్షకులకు మా చిత్రం బాగా నచ్చుతుంది .

అజయ్ గారు భర్త పాత్ర చేశారు. ఆయన పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. ఆయన పాత్రకి బాగా న్యాయం చేశారు. ప్రేక్షకులకి అజయ్ గారి పాత్ర బాగా నచ్చుతుంది.

కథ కథనం పూర్తి అయిన తర్వాత ఎస్తర్ గారిని కలిసాను. ఆడిషన్ చేశారు, తాను క్యారెక్టర్ కి బాగా సరిపోతుంది అని తనని మేము తీసుకున్నాము. ఎస్తర్ గారు కూడా కథ విని కంటెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది అని అన్నారు.

మా నిర్మాత బాపి రాజు గారు నాకు మంచి స్నేహితుడు. బాపి రాజు 17 ఎళ్లగా నా చిత్రాలను డిస్ట్రిబ్యూటర్ గా విడుదల చేశారు. తర్వాత నిర్మాతగా రొమాంటిక్ క్రిమినల్స్ మరియు ఈ సంస్కార్ కాలనీ చిత్రాలు నిర్మించారు. నాతో పని చేసే ప్రతి ఒక్కరు ఫ్యామిలీ గా కలిసిపోతున్నారు. ప్లాప్ వచ్చినా సక్సెస్ వచ్చినా కలిసే ఉన్నారు. ప్రతి సినిమా కి సహాయం గా ఉన్నారు.

ఈ చిత్రం తర్వాత చదలవాడ శ్రీనివాస్ రావు గారు నిర్మాతగా మా నాన్న నక్సలైట్ అనే చిత్రం చేస్తున్నాను. 1995 బ్యాక్ డ్రాప్ లో సాగే తండ్రి కొడుకుల సినిమా. తర్వాత డాక్టర్ ఎల్ ఎన్ రావు, యక్కలి  రవీంద్ర బాబు నిర్మించిన వెల్కమ్ టు తీహార్ కాలేజ్ చిత్రం జూలైలో విడుదల చేస్తున్నాము. (Story: టీనేజ్ కుర్రాడికి  పెళ్ళైన అమ్మాయి కి మధ్య…!)

See Also: Do You Know About Koo Innovative Features

Bacardi’s Good Man Brandy Out Now

డిజిటల్‌ సంచలనం : ప్రపంచంలోనే తొలి మెటావర్స్‌ పెళ్లి!

తెలంగాణలో ఉద్యోగమేళా! Full Details

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version