డిజిటల్ చెల్లింపులు అదుర్స్!
సమ్మిళిత ఆర్థిక వ్యవస్థకు మూలం డిజిటల్ చెల్లింపులు
Digital payments are the foundation of an inclusive economy
Digital payments : మహమ్మారి కాలంలో డిజిటల్ చెల్లింపులకు అపూర్వమైన ఆదరణ లభించింది. లావాదేవీల నిర్వహణలోని సౌలభ్యం వినియోగదారులను డిజిటల్ దిశగా మారేందుకు ప్రేరేపించబడింది. గత కొద్ది సంవత్సరాలను పరిశీలిస్తే, భారతదేశపు డిజిటల్ చెల్లింపు వ్యవస్థలలో అసాధారణ వృద్ధి కనిపిస్తుంది. వినియోగదారులతో పాటుగా వ్యాపారులు సైతం డిజిటల్ స్వీకరణలోని సౌకర్యం మరియు దానితో పాటుగా వస్తున్న భద్రత ప్రయోజనాలను గుర్తిస్తున్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ప్రకటించిన ఆర్థిక అక్షరాస్యత వారోత్సవానికి అనుగుణంగా ఈ సంవత్సర నేపథ్యమైన ‘గో డిజిటల్, గో సెక్యూర్’కు సహకరించే వినియోగదారులకు డిజిటల్ చెల్లింపులు ఏ విధంగా సౌకర్యం అందిస్తాయి మరియు వినియోగదారులకు ఇబ్బందుల్లేని అనుభవాలను అందిస్తాయో మాస్టర్ కార్డ్ వెల్లడిస్తుంది.
ఈ–కామర్స్ వృద్ధికి తోడ్పడుతున్న అతి కీలకమైన అంశాలలో డిజిటల్ చెల్లింపులు ఒకటి. ఇంటి ముంగిటనే తమకు కావాల్సిన వస్తువులను పొందే సౌకర్యంతో వినియోగదారులు పూర్తి నమ్మకంతో ఆన్‌లైన్‌లో ఆర్డర్లను ఇస్తున్నారు మరియు డిజిటల్ చెల్లింపులనూ చేస్తున్నారు. అదనంగా, డిజిటల్ చెల్లింపులు చేయడం వల్ల వినియోగదారులు పూర్తి సౌకర్యవంతమైన జీవితాన్ని సైతం ఆస్వాదిస్తున్నారు. వారు వైవిధ్యమైన చెల్లింపు అవకాశాలనూ పొందుతున్నారు. ఎందుకంటే దీనివల్ల వారు ఏటీఎం విత్‌డ్రాయల్స్ కోసం నిలబడనవసరం లేదు లేదా నగదును తీసుకుని వెళ్లాల్సిన అవసరమూ లేదు.
నూతన తరహా చెల్లింపు పద్ధతులు అయినటువంటి కాంటాక్ట్‌లెస్ కార్డులు, ట్యాప్ అండ్ గో, క్యుఆర్ కోడ్ మొదలైన వాటితో ప్రమాదాలు తగ్గాయి మరియు డిజిటల్ చెల్లింపులు సరళంగామరియు సురక్షితంగా మారాయి. ఈ తాజా సాంకేతికతలు అత్యాధునిక పరిజ్ఞానం తో ఉండటంతో పాటుగా ప్రవర్తనా విధానాలను సైతం అంచనా వేస్తాయి. అనధికారికంగా సమాచారం పొందాలనుకోవడం మరియు ఆన్‌లైన్ మోసాలకు వ్యతిరేకంగా అదనపు రక్షణను సైతం సృష్టిస్తాయి. మెరుగైన సాంకేతికత మరియు అవగాహనతో, డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు ప్రజలకు సురక్షితమైన, భద్రతతో కూడిన మరియు సౌకర్యవంతమైన అనుభవాలను అందిస్తున్నాయి. ఇప్పుడు‘ కార్డ్ ఆన్ ఫైల్ టోకనైజేషన్’ పరిచయం చేయడంతో డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థకు అదనపు లేయర్ జోడించడం జరుగుతుంది. ఈ విధానంలో కార్డు నెంబర్‌కు వినూత్నమైన ప్రత్యామ్నాయ మార్గం గా ‘టోకెన్’ అందించబడుతుంది.
వినియోగదారులకు మాదిరిగానే, చిరు వ్యాపారాలు అధికారిక ఆర్ధిక సేవలలో ప్రవేశించేందుకు ముఖద్వారంగా డిజిటల్ చెల్లింపులు నిలుస్తున్నాయి. తమ వ్యాపార వ్యవస్ధలతో డిజిటల్ చెల్లింపులను మిళితం చేయడం వల్ల, డిజిటల్ చెల్లింపుల కోసం మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలకనుగుణంగా సేవలనందించడమూ వీలవుతుంది. అలాగే వారు తమ వ్యాపారాలను వృద్ధి చేసుకునేందుకు, డిజిటల్‌ఫైనాన్షియల్ ఫుట్ ప్రింట్ అభివృద్ధి చేసుకునేందుకు తోడ్పడుతుంది. దీనిని వారు ఆర్థిక సంస్థల నుంచి అధికారికంగా ఋణాలను పొందేందుకు సైతం వినియోగించవచ్చు. అదనంగా డిజిటల్ చెల్లింపులతో మౌలిక వసతుల సవాళ్లు తగ్గడంతో పాటుగా సౌకర్యమూ మెరుగుపడుతుంది. సురక్షితమైన, భద్రతతో కూడిన మార్గం సృష్టించడం ద్వారా నూతన వ్యాపారాలు మరియు మైక్రో మర్చంట్స్‌ను డిజిటల్ పర్యావరణ వ్యవస్ధలోనికి తీసుకువస్తుంది. (Story:డిజిటల్ చెల్లింపులు అదుర్స్!)
See Also: డిజిటల్ సంచలనం : ప్రపంచంలోనే తొలి మెటావర్స్ పెళ్లి!