దయామయుడు ప్రవక్త మహమ్మద్
న్యూస్‌తెలుగు/వినుకొండ : పట్టణంలోని సాధన ఇన్స్టిట్యూట్ లో డైరెక్టర్ ఎస్. కే. యం. భాషా ఆధ్వర్యంలో మంగళవారం మీలాదుల్ నబి మాసోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వినుకొండ మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫ్రుల్లా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవులంతా ఒకటేనని ప్రతి ఒక్కరూ పరస్పరం ప్రేమ భావం, శాంతి భావన కలిగి ఉండాలని ప్రవక్త మహమ్మద్ బోధించారని అన్నారు. హింసకు వ్యతిరేకంగా, శాంతిని బోధిస్తూ ప్రవక్త రాళ్ల దెబ్బలు భరించారని చెప్పారు. స్త్రీలను గౌరవించాలని, స్త్రీల హక్కుల కోసం అందరూ పాటుపడాలని ప్రవక్త బోధించారని చెబుతూ వ్యభిచారం, మద్యపానం తదితర దురలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పారు. పేద ధనిక వ్యత్యాసాలు కుల,మత వ్యత్యాసాలు వీడి మానవులు సోదరుల వలే కలిసిమెలగాలన్న ప్రవక్త బోధ సర్వమానవాళికి ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో కవి కరిముల్లా, సాంఘిక ఉపాధ్యాయులు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. (Story : దయామయుడు ప్రవక్త మహమ్మద్)