UA-35385725-1 UA-35385725-1

చోర్ బజార్ ‘జడ’ సాంగ్ విడుదల

హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘‘చోర్ బజార్’’ చిత్రం నుంచి మెలోడీ గా
సాగే ‘జడ’ లిరికల్ సాంగ్ విడుదల

ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ
నాయికగా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్
చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్
పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా థియేటర్ లలో విడుదలకు
సిద్ధమవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న “చోర్ బజార్”
సినిమా నుంచి సాంగ్స్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. తాజాగా ఈ చిత్రంలోని
‘అబ్బబ్బా ఇది ఏం పోరి’ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

హీరోయిన్ అందాన్ని వర్ణిస్తూ సాగే పాట ఇది. పాట ఎలా ఉందో
చూస్తే..అబ్బబ్బా ఇది ఏం పోరి..చూడగానే కళ్లు చెదిరి, కోసేసానమ్మో దాని
జడపై మనసు పడి…మెడకీ నడుముకి నడుమ నాగుబాములాగ కదలాడి..ఉరిబోసిందమ్మో
దాని కురులతో ఊపిరికి..అంటూ సాగుతుందీ పాట. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని
అందించిన ఈ పాటను రామ్ మిర్యాల ఆకట్టుకునేలా పాడారు. మిట్టపల్లి సురేందర్
సాహిత్యాన్ని అందించారు. భాను కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో సీనియర్ నాయిక
అర్చన, హీరో ఆకాష్ పూరీ కనిపిస్తారు.  “చోర్ బజార్” సినిమా త్వరలో
థియేటర్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.

సాంకేతిక నిపుణులు – సినిమాటోగ్రఫీ – జగదీష్ చీకటి, సంగీతం – సురేష్
బొబ్బిలి, ఎడిటింగ్ – అన్వర్ అలీ, ప్రభు దేవా, ఆర్ట్ – గాంధీ నడికుడికర్,
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం
సౌండ్ డిజైనర్ : సాయి మనీందర్ రెడ్డి, ఆడియో – లహరి, కాస్ట్యూమ్స్
డిజైనర్ – ప్రసన్న దంతులూరి, ఫైట్స్ – ఫృథ్వీ శేఖర్, కొరియోగ్రఫీ – భాను,
పబ్లిసిటీ డిజైనర్ – అనిల్ భాను ,  స్టిల్స్ : వికాస్ సీగు, పి.ఆర్.వో –
జీఎస్కే మీడియా,  మేకప్ – శివ, కాస్ట్యూమ్ చీఫ్ – లోకేష్, డిజిటల్ మీడియా
– వాల్స్ అండ్ ట్రెండ్స్, సహ నిర్మాత – అల్లూరి సురేష్ వర్మ, బ్యానర్ –
ఐ.వి ప్రొడక్షన్స్, నిర్మాత – వీ.ఎస్ రాజు, రచన, దర్శకత్వం – బి. జీవన్
రెడ్డి. (Story: చోర్ బజార్ ‘జడ’ సాంగ్ విడుదల)

See Also: మెగాస్టార్ మేడే!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1